ఎన్టీఆర్ – మ‌హేష్ మ‌ధ్య‌లో క్రేజీ డైరెక్ట‌ర్‌

September 12, 2019 at 11:54 am

ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. శాండ‌ల్‌వుడ్ స్టార్ హీరో య‌శ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషలలోనూ సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. కన్నడ బాహుబలి గా అందరిచేత ప్రశంసలు అందుకున్న కేజిఎఫ్ కు సీక్వెల్ గా ఇప్పుడు కేజిఎఫ్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ 2 సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఎవ‌రితో సినిమా చేస్తార‌న్న‌ది పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. మొదట్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తారని, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. సాయి కొర్ర‌పాటి ద్వారా ఈ డీల్ న‌డిచినట్టు టాక్.

అయితే ఇప్పుడు ప్ర‌శాంత్ నెక్ట్స్ సినిమా మ‌హేష్‌బాబుతోనే ఉంటుంద‌ని అంటున్నారు. ఇటీవ‌లే ప్ర‌శాంత్ హైద‌రాబాద్ రావ‌డం.. మ‌హేష్‌బాబును మీట్ అవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజ‌మౌళితో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయ్యే స‌రికి వ‌చ్చే యేడాది జూన్ అవుతుంది.

ఇక మ‌హేష్ డిసెంబ‌ర్‌కు ఫ్రీ అయిపోతాడు. అందుకే ప్ర‌శాంత్ మ‌హేష్‌తో సినిమా చేసేందుకు అత‌డిని క‌లిసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ప్ర‌శాంత్ ఫైన‌ల్‌గా ఈ ఇద్ద‌రిలో ఎవ‌రితో ఫిక్స్ అవుతాడో ? చూడాలి.

ఎన్టీఆర్ – మ‌హేష్ మ‌ధ్య‌లో క్రేజీ డైరెక్ట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts