బుడ్డోడిని పెండ్లి చేసుకోనంటున్న కాజల్ …!

September 21, 2019 at 1:14 pm

పెండ్లి అంటే నూరేళ్ళ పంట అంటారు పెద్ద‌లు. అయితే ఈ పెండ్లి చేసుకునే వ‌రుడు వ‌ధువు క‌న్నా చిన్నోడు అయితే పెద్ద తంటా.. మ‌రి వ‌రుడు క‌న్నా వ‌ధువు చిన్న‌ద‌యితేనే ఈడు జోడు చ‌క్క‌గా కుదిరింది అంటారు పెద్ద‌లు. అందుకే వ‌దువు క‌న్నా వ‌రుడు పెద్ద వ‌య‌స్సు చూసి పెండ్లి చేస్తారు పెద్ద‌లు. అయితే ఇప్పుడు రోజులు మారాయి క‌దా… వ‌దువు క‌న్నా వ‌రుడే పెద్ద‌గా ఉండాల‌ని రూల్ లేద‌ట‌..

అందుకే ప్రేమ వివాహాలు వ‌చ్చిన త‌రువాత పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా వివాహాలు జ‌రిగిపోతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ అమ్మ‌డు మాత్రం నాక‌న్నా వ‌య‌స్సులో పెద్ద వ‌రుడిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెండ్లి చేసుకోనూ అంటూ ఖ‌రాకండిగా చెపుతుంది. ఇంత‌కు ఇలా చెపుతున్న ఎవ‌రా న‌టి అనుకుంటున్నారా.. వెండితెర చంద‌మామ కాజల అగర్వాల్‌.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది హీరోయిన్లు త‌మ‌క‌న్నా చిన్న వ‌య‌స్సున్న వారిని ఎంచ‌క్కా పెండ్లి చేసుకుని సంసార సాగ‌రం సంతోషంగా ఈదుతున్నారు. అయితే కాజ‌ల్ అగ‌ర్వాల్ మాత్రం నేను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నాక‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న బుడ్డోడిని పెండ్లి చేసుకోను అని చెప్పింది. బాలీవుడ్ బామ ప్రియాంక చోప్రా చిన్న‌వాడిని పెండ్లి చేసుకుని సుఖ‌ప‌డుతుంది. ఇక అర్జున్ క‌పూర్‌, మ‌లైకా అరోరా వంటివారు ఉండ‌నే ఉన్నారు. ఇక కాజ‌ల్ త‌న‌క‌న్నా చిన్న‌వాడిని పెండ్లి చేసుకుంటే వ‌చ్చే న‌ష్టమేంటో మ‌రి…

బుడ్డోడిని పెండ్లి చేసుకోనంటున్న కాజల్ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts