ప్ర‌తిప‌క్షాల నోటికి తాళం వేసిన కేసీఆర్‌..!

September 10, 2019 at 3:54 pm

తెలంగాణ అంటేనే ఉద్య‌మాల గ‌డ్డ‌. ఉద్య‌మాల‌కు పెట్టింది పేరు అయిన తెలంగాణ‌లో నిత్యం ఏదో ర‌కంగా ఉద్య‌మాలు జ‌రుగుతూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు తెలంగాణ‌లో గ‌త కొంత‌కాలంగా తెరాస ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాయి. ఇంత‌కు తెరాస ప్ర‌భుత్వంపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో ప్ర‌తిప‌క్షాల నోటికి తాళం ప‌డ్డ‌ట్లేనా ఇక భ‌విష్య‌త్‌లో తెరాస ప్ర‌భుత్వంపై ప్రతిప‌క్షాలు విమ‌ర్శించే అవ‌కాశం ఇవ్వ‌కుండా గురిచూసి కొట్టాడా అంటే అవున‌నే అంటున్నాయి తెరాస వ‌ర్గాలు..

అయితే ఇంత‌కు కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు ఏంటివి.. ప్ర‌తిప‌క్షాల నోటీకి తాళం వేసే ప‌ని ఏమి చేశాడో అనే క‌దా మీ అనుమానం. తెలంగాణ ఉద్య‌మనేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మొదటి నుంచి ఓ విమ‌ర్శ ఉంది. దాన్ని విమ‌ర్శ‌గానే చూడాల్సిన అవ‌స‌రం లేదు.. కేసీఆర్ కావాల‌నే త‌న క్యాబినెట్‌లో మొద‌టి నుంచి మ‌హిళ‌ల‌కు మొండిచేయి చూప‌డం మ‌నం చూసాం. అస‌లు మ‌హిళ‌ల‌కు క్యాబినేట్‌లో లేకుండా ఓ ట‌ర్మ్ ప‌రిపాల‌న చేసిన కేసీఆర్ రెండో ట‌ర్మ్‌లోనూ అవ‌కాశం ఇవ్వ‌కుండా కాల‌యాప‌న చేశాడు. వాస్త‌వంగా చూసుకుంటే దేశ చరిత్ర‌లో ఏ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు క్యాబినెట్‌లో అవ‌కాశం లేకుండా ప‌రిపాల‌న చేయ‌లేద‌నేది స‌త్యం.

అయితే కేసీఆర్ మాత్రం మ‌హిళా వ్య‌తిరేకిగా మారి మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని నిత్యం ప్ర‌తిప‌క్షాలు, రాజ‌కీయ ప‌క్షాలు, ప్ర‌జాసంఘాలు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాయి. అయితే చాలాకాలం త‌రువాత రెండోద‌పా మంత్రివ‌ర్గ విస్త‌రణ‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చాడు. తెలంగాణ తొలి మ‌హిళా మంత్రులుగా ప‌టోళ్ళ స‌బీతా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తిరాథోడ్‌ల‌కు అవ‌కాశం క‌ల్పించింది. వీరిని నియ‌మించి ఇప్పుడు మ‌హిళ‌లు లేని క్యాబినెట్ అనే అప‌వాదును తొల‌గించుకున్నాడు కేసీఆర్‌. ఇక మ‌హిళ‌లు లేని క్యాబినెట్ అనే విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం లేకుండా ప్ర‌తిప‌క్షాల నోటికి తాళం వేశాడ‌నే చెప్ప‌వ‌చ్చు కేసీఆర్‌.

ప్ర‌తిప‌క్షాల నోటికి తాళం వేసిన కేసీఆర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts