టీఆర్ఎస్‌కు మ‌రో ఎమ్మెల్యే షాక్‌… బీజేపీలోకి ఆ ఎమ్మెల్యే..!

September 12, 2019 at 5:01 pm

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అసంతృప్తి ప్రకంపనలు ఇంకా టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నాయి. మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న అసంతృప్తితో ఉన్న నేత‌లు ఒక్కొక్క‌రిగా త‌మ గ‌ళాలు వినిపిస్తూనే ఉన్నారు. ఇక మంత్రి ప‌ద‌వి ఉన్నా పార్టీలో ప్రాధాన్యం లేద‌ని భావిస్తోన్న నేత‌లు కూడా అధిష్టానం టార్గెట్‌గా ఏదో ఒక వ్యాఖ్య చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈట‌ల రాజేంద‌ర్ నుంచి ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌, తాటికొండ రాజ‌య్య‌, నాయిని నర్సింహారెడ్డి ఇలా ఈ వ‌రుస‌లోనే మ‌రో ఎమ్మెల్యే వ‌చ్చి చేరిపోయారు.

అధికార పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ గురువారం నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. భోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. మైనార్టీ కోటాలో ఆయ‌న మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు.

అటు కేసీఆర్ కుమార్తె క‌విత‌కు స‌న్నిహితంగా ఉండ‌డంతో త‌న మంత్రి ప‌ద‌వి కోరిక తీరుతుంద‌నే ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగిన రెండు రోజుల‌కే ఆయ‌న టీఆర్ఎస్ బ‌ద్ధ శ‌త్రువు, అందులోనూ క‌విత‌ను ఓడించిన బీజేపీ ఎంపీ అర్వింద్‌తో భేటీ కావ‌డం రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. అర్వింద్‌తో భేటీ అనంతరం షకీల్‌ పార్టీ మారడంపై స్పందించారు. పార్టీ మారితే మారొచ్చు అంటూ ఫీలర్లు వదిలారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే ఆయ‌న పార్టీ మారిపోయేందుకు డిసైడ్ అయిపోయార‌నే అంటున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని సోషల్‌ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది.

టీఆర్ఎస్‌కు మ‌రో ఎమ్మెల్యే షాక్‌… బీజేపీలోకి ఆ ఎమ్మెల్యే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts