కోడెల మృతికి కార‌ణాలు ఇవే…!

September 16, 2019 at 1:37 pm

72 ఏళ్ల వ‌య‌స్సు… 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం… తిరుగులేని నేత‌… గుంటూరు జిల్లా రాజ‌కీయాల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో శాసించారు. చంద్ర‌బాబు, ఎన్టీఆర్ వ‌ద్ద ఆయ‌న ఏం చెపితే అదే వేదం… అలాంటి నేత జీవితంలో చివ‌రి ద‌శ‌లో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు… తీవ్ర‌మైన ఒత్తిళ్లు త‌ప్ప‌లేదు. ఇంద‌కు ఆయ‌న స్వ‌యంకృతాప‌రాధం కూడా కొంత ఉంది. ముఖ్యంగా 2014లో స‌త్తెన‌ప‌ల్లిలో గెలిచాక కోడెల త‌న కుమారుడు శివ‌రాం ప్ర‌సాద్‌, కుమార్తె విజ‌య‌ల‌క్ష్మిని ఏ మాత్రం అదుపులో పెట్టుకోలేక‌పోయార‌న్న ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయి.

ఆయ‌న వైద్యుడిగానే కాకుండా, రాజ‌కీయ నాయ‌కుడిగా, మంత్రిగా కూడా జిల్లా ప్ర‌జ‌ల‌కు ఎంతో సేవ చేశారు. స‌ర్జ‌న్ అయిన కోడెల డాక్ట‌ర్‌గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో డాక్ట‌ర్ గారు, ప‌ల్నాటి పులిగా ఆయ‌న చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. ఎన్నో విపత్కర రాజకీయ పరిస్థితులను చూసిన ఆయన అంతే ధీటుగా ప్రత్యర్ధులను ఢీకొన్నారు. చివ‌రి ద‌శ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌న్ను బాగా క‌లిచి వేశాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనపై జరిగిన దాడి, కుమారుడు, కుమార్తె ప‌నుల‌పై వ‌రుస‌గా వ‌స్తోన్న కేసులు.. అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ వ్య‌వ‌హారం ఇలా అన్ని ఆయ‌న్ను చుట్టుముట్టాయి.

ఓ సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్న ఆయ‌న చివ‌ర్లో ఒత్తిళ్లు, అవ‌మానాలు దిగ‌మింగుకోలేక‌పోయారు. ఈ నేథ్యంలో ఆయన కొద్దిరోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న రాత్రి కూడా ప్రమాదకరమైన ఇంజిక్షన్లను తానే స్వయంగా చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని అనుచరులు అంటున్నారు. దీని వల్లే ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చిందని సమాచారం.

ఎవ‌రెన్ని చెప్పుకున్నా కుమారుడు, కుమార్తె తీరుతో ఆయ‌న త‌న బాధ‌ను ఎవ్వ‌రికి చెప్పుకోలేక లోలోన ర‌గిలిపోతున్నారన్న‌ది టీడీపీ వ‌ర్గాల్లోనే కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఓటిమి వార‌సుల తీరే ఓ కార‌ణం అని టాక్‌.

కోడెల మృతికి కార‌ణాలు ఇవే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts