కోడెల కేసులో కొత్త ట్విస్ట్‌… ‘ కొడుకే చంపేశాడు ‘

September 16, 2019 at 6:09 pm

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమానాస్పద మృతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సోమ‌వారం ఉద‌యం కోడెల మృతి చెందిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న మృతి స‌హ‌జ మ‌ర‌ణ‌మా ? లేదా ? ఆత్మ‌హ‌త్యా ? అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదు. మ‌రోవైపు తెలంగాణ పోలీసులు ఈ విష‌యంలో విచార‌ణ చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వ‌చ్చాక అస‌లు నిజం బ‌య‌ట ప‌డుతుంద‌ని అంద‌రు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ కేసులో ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్టు చోటు చేసుకుంది. తాజాగా కోడెల మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు కోడెల శివరాం వల్లనే శివప్రసాద్ చనిపోయాడని సత్తెనపల్లి డీ ఎస్పీకి పిర్యాదు చేశారు మేనల్లుడు కంచేటి సాయి. శివ‌రాం త‌న‌ను మాన‌సికంగా, శారీర‌కంగా హింసిస్తున్నాడ‌ని కోడెల త‌న‌కు ఫోన్ చేసి చెప్పార‌ని కూడా సాయి తెలిపారు.

కోడెల‌ను హ‌త్య చేసిన శివ‌రాం… ఆపై దానిని ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. కోడెల చాలా ధైర్యంగా ఉంటార‌ని… ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కోడెల‌కు లేదన్నారు. కొద్ది రోజులుగా శివ‌రాం ఆస్తి మొత్తం తన పేరున రాయాల్సిందిగా శివరాం ఒత్తిడి తెస్తున్నారని, తనను హత్య చేసేందుకు సిద్ధపడ్డవచ్చు అని కోడెల త‌న‌తో ఫోన్లో ఆందోళ‌న చెందార‌ని సాయి వెల్ల‌డించారు.

ఇక కేవ‌లం ఆస్తి కోస‌మే త‌న మామ‌య్య‌ను శివ‌రాం హ‌త్య చేశాడ‌ని.. దీని పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సాయి కోరారు. ఇప్ప‌టికే కోడెల మృతికి ప‌రోక్షంగా కుమారుడు శివ‌రాంతో పాటు కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి కార‌ణ‌మ‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా… ఇప్పుడు స్వ‌యాన కోడెల మేన‌ళ్లుడే శివ‌రాం చంపేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

కోడెల కేసులో కొత్త ట్విస్ట్‌… ‘ కొడుకే చంపేశాడు ‘
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts