కోడెల మర‌ణం.. నేటి నేత‌ల‌కు చెబుతున్న పాఠం ఏంటి?

September 16, 2019 at 4:29 pm

టీడీపీ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు అనూహ్యంగా మృతి చెందిన ఘ‌ట న రాష్ట్ర వ్యాప్తంగా గ‌గ్గోలు పుట్టించింది. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని లేదు.. ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చింద‌ని, ఆస్ప‌త్రికి వెళ్లే లోగానే మృతి చెందార‌ని ఇలా భిన్న‌మైన క‌థ‌నాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే, వాస్త‌వం మాత్రం ఒక్క‌టే.. రాజ‌కీయాల‌ను శ్వాసించిన, రాజ‌కీయాల‌ను శాసించిన నాయ‌కుడు మాత్రం ఇప్పుడు అనంత వాయువుల్లో క‌లిసిపోయారు. అయితే, ఇప్పుడు కోడెల మ‌ర‌ణం ద్వారా నాయ‌కులు తెలుసుకోద‌గిన పాఠాలు ఉన్నాయా? ఆయ‌న మ‌ర‌ణం ఏం చెబుతోంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

ఏ పార్టీ నాయ‌కుడికైనా.. రాజ‌కీయంగా ఎద‌గాల‌ని, పేరు తెచ్చుకోవాల‌ని ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ క్ర‌మంలో వార‌సులుగా ఉండే పిల్ల‌లు ఈ నాయ‌కుల ఉనికికిప్ర‌చోద‌నంగా మారితే ఫ‌ర్వాలేదు కానీ.. ప్ర‌హ‌సంన‌గా మారితే.. ఆ త‌ర్వాత ప్ర‌మాదకరంగా మారితే మాత్రం ఇలాంటి ఘ‌ట‌న‌లే చోటు చేసుకుంటాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కోడెల విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న కుమారుడు, కుమార్తెలు.. 2014 కు ముందు పెద్ద‌గా తెర‌మీదికి రాలేదు. కానీ, 2014 ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి కోడెల గెలుపు గుర్రం ఎక్క‌డం, ఆ త‌ర్వాత ఆయ‌న ఏకంగా రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉండ‌డంతో ఆ ప‌ద‌విని అడ్డు పెట్టుకుని రెచ్చిపోయార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ముఖ్యంగా స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరుల్లో కే ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున దందాలు సాగించార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌, కుమార్తె విజ‌య‌ల‌క్ష్మిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇక‌, కుమారుడు త‌ను నిర్వ‌హిస్తున్న ఓ బైక్ షోరూంలో వినియోగ దారుల నుంచి ప‌న్నులు వ‌సూలు చేసి.. వాటిని ప్ర‌భుత్వానికి జ‌మ చేయ‌కుండా.. త‌మ ఖాతాలో వేసుకున్నార‌ని కేసులు న‌మోద‌య్యాయి. ఇవిలా ఉంటే.. అసెంబ్లీ ఫ‌ర్నిచ‌ర్‌ను త‌న ఇంటికి త‌ర‌లించిన విష‌యంలోనూ కేసులు న‌మోద‌య్యాయి.

మొత్తానికి ఏ నాయ‌కుడైనా త‌న కుటుంబాన్ని, త‌న వార‌సుల‌ను త‌న ఇష్టాయిష్టాల‌ను ఎంత వ‌ర‌కు వినియోగించుకుంటే మంచిదో .. అంత‌వ‌ర‌కే వినియోగించుకుని కొన్ని ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌నేది కోడెల ఘ‌ట‌న చెబుతున్న స‌మ‌గ్ర పాఠం!! మ‌రి ఎంత మందికి ఈ ఘ‌ట‌న క‌నువిప్పు క‌లిగిస్తుందో చూడాలి.

కోడెల మర‌ణం.. నేటి నేత‌ల‌కు చెబుతున్న పాఠం ఏంటి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts