గుంటూరు పాలిటిక్స్‌పై కోడెల ముద్ర‌

September 16, 2019 at 1:16 pm

మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఇక‌లేరు. సోమ‌వారం ఉద‌యం అనూహ్య రీతిలో ఆయ‌న మృతి చెందా రు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా దావాల‌నంగా వ్యాపించింది. కోడెల అభిమానులు, అనుచ‌రులు… టీడీపీ నాయ కులు కూడా ఈ ప‌రిస్థితితో దిగ్భాంతికి గుర‌య్యారు. ఆయ‌న ఏం చేస్తున్నా పార్టీ కోసం ప్ర‌జ‌ల కోసం నిత్యం త‌పించేవారు. 1982లో టీడీపీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత అన్న‌గారి పిలుపు మేర‌కు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కోడెల అంచెలంచ‌లుగా రాజ‌కీయాల్లో శిఖ‌ర స‌మాన ప‌ద‌వుల‌ను అందుకున్నారు. ఎన్టీఆర్ ద‌న్నుతో రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో దూసుకుపోయారు.

ఇక‌, చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న ప‌ద‌వి చేప‌ట్టినా.. ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల అభ్యున్న‌తికోసం త‌న‌దైన శైలిలో దూసుకుపోయేవారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గం గురించే ఎక్కువ‌గా క‌ల‌లు క‌నేవారు. ఇక్క‌డి తాగు నీటి స‌మ‌స్య‌ప‌రిష్కారం కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. త‌న‌దైన శైలిలో ఇక్క‌డ ర‌హ‌దారులు, పాఠ‌శాల‌లు, వైద్యాల‌యాలు క‌ట్టించారు. ప్ర‌జ‌ల‌కు అన్ని వేళ‌లా అండ‌గా ఉన్నారు. పేట అంటే కోడెల‌, కోడెల అంటే న‌ర‌స‌రావు పేట అనే రేంజ్‌లో రాజ‌కీయాలు న‌డిపించారు.

జిల్లాలోనూ అనేక మంది రాజ‌కీయ నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. కోడెల త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకు న్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, స్పీక‌ర్‌గా ఏ ప‌ద‌విని ఆయ‌న చేప‌ట్టినా.. దానికి వ‌న్నె తెచ్చేందుకు ప్ర‌య త్నించారు. ఆద‌ర్శ భావాలు ఉన్న నాయ‌కుడిగా కూడా కోడెల గుర్తింపు సాధించారు. రాష్ట్రంలో స్పీక‌ర్‌గా ఉంటూనే మ‌హిళా ప‌క్ష‌పాతిగా మ‌హిళా స‌ద‌స్సును నిర్వ‌హించారు. కోట‌ప్ప‌కొండ‌ను ఓ ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్ద‌డంలో కోడెల కృషిని త‌గ్గించ‌లేం. చంద్ర‌బాబు కు న‌మ్మిన బంటుగా కూడా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. మొత్తంగా గుంటూరు రాజ‌కీయాల్లో కోడెల ప్ర‌స్తానం ఓ అద్భుతం!

గుంటూరు పాలిటిక్స్‌పై కోడెల ముద్ర‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts