కోడెల సూసైడ్ లేఖ‌… 15 రోజుల క్రిత‌మే… !

September 16, 2019 at 3:22 pm

కోడెల శివప్రసాద్ మరణం చుట్టూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కోడెల ఎలా ? మరణించారన్న దానిపై చర్చ జరుగుతుంది. ఈ విష‌యంలో ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. ఇక కుటుంబ స‌భ్యులు మాత్రం ఈ విష‌యంపై నోరు విప్ప‌డం లేదు. ఎంతో ధైర్యం ఉన్న కోడెల ఇలా చేశారంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌లేక‌పోతున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన అభిమానులు చెబుతున్నారు.

ఈ మూడు నెల‌ల కేసుల‌కే ఇలా ఉంటే ఆయ‌న గ‌తంలో ఎన్నో దాడులు, కేసులు ఎదుర్కొన్నార‌ని.. వాటితో పోలిస్తే ఇవి చాలా చిన్న‌వ‌ని అంటున్నారు. ఇక కోడెల జూబ్లిహిల్స్‌లోని త‌న గ‌దిలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తెలంగాణ పోలీసులు కోడెల గ‌దిని అణువ‌ణువు ప‌రిశీలిస్తున్నారు. ఇక సూసైడ్ నోట్ ఉంద‌న్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి.

వైద్యుల పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కొందరు గుండెపోటుతో చనిపోయారని అంటుంటే.. మరికొందరు విషప్రయోగం చేసుకున్నారని అంటున్నారు. కొంద‌రు ఇంట్లో ఉన్న వైరుతో ఊరేసుకున్నార‌ని చెపుతున్నారు. ఇదిలా ఉంటే కోడెల రెండు వారాలకు ముందు ఆత్మహత్యకు ప్రయత్నించారని చెబుతున్నారు.

ఇటు కుమారుడి తీరుతో పాటు అటు కేసుల నేప‌థ్యంలో మ‌నోవేద‌న‌కు గురైన ఆయ‌న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించార‌ట‌. అయితే సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈరోజు ఆయ‌న చేసిన ప‌నిని ఆల‌స్యంగా గుర్తించ‌డంతో ప్రాణాలు కోల్పోయారు.

కోడెల సూసైడ్ లేఖ‌… 15 రోజుల క్రిత‌మే… !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts