పొలిటిక‌ల్ స్టార్‌కు.. యంగ్ రెబ‌ల్‌స్టార్ మ‌ద్ద‌తు..!

September 11, 2019 at 12:17 pm

ఆయ‌నో పొలిటిక‌ల్ స్టార్‌.. నిత్యం ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పైన‌, సామాజిక ఆంశాల‌పైన‌, సెలబ్రెటిల‌కు చెందిన విష‌యాల‌పై సోష‌ల్ మీడియా ఖాతాలో మ‌మేకం అవుతాడు.. అంద‌రితో నిత్య సంబంధాలు సోష‌ల్ మీడియా వేధిక‌గా క‌లుపుకుంటాడు..వారి బాగోగుల్లో పాలుపంచుకుంటాడు.. అత‌డు ఎవ‌రో కాదు.. తెలంగాణ‌లో ఇప్పుడు డైన‌మిక్ పొలిటిక‌ల్ స్టార్‌గా నిలుస్తున్న ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ఉర‌ప్ కేటీఆర్‌.

అయితే ఇప్పుడు ఈ కేటీఆర్‌కు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ స‌పోర్టుగా నిలుస్తున్నాడు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్ర‌భాస్ ఫాలోవ‌ర్లు ల‌క్ష‌ల్లో ఉంటారు. అయితే ఇప్పుడు కేటీఆర్‌కు వీరంద‌రు మద్ద‌తుగా నిల‌వాల‌ని హిత‌బోధ చేస్తున్నాడు ప్ర‌భాస్‌. అంటే త‌న అభిమాన గ‌ణాన్ని కేటీఆర్ చేసే సామాజిక కార్య‌క్ర‌మాల్లో భాగ‌మ‌వ‌మ‌ని సూచ‌న చేస్తున్నాడు..

అయితే పొలిటిక‌ల్ స్టార్ కేటీఆర్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా చూసి, సినిమా బాగుంద‌ని ట్వీట్ట‌ర్లో అభినంద‌న‌లు తెల‌ప‌డ‌మే కాకుండా, అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఎదిగిందంటూ ట్వీట్స్ చేసారు. దీనికి ప్ర‌తిగా ప్ర‌భాస్ కేటీఆర్ చేప‌ట్టిన సామాజిక ఉద్య‌మానికి మ‌ద్దతుగా వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ రాకుండా మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. దయచేసి ఈ విషయాన్ని అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్యంగా ఉండండి కేటీఆర్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వండి అంటూ అభిమానుల‌కు సూచ‌న చేసాడు ప్ర‌భాస్‌. సో పొలిటిక‌ల్ స్టార్‌కు సినిస్టార్ మ‌ద్ద‌తు దొరికిన‌ట్లే…

పొలిటిక‌ల్ స్టార్‌కు.. యంగ్ రెబ‌ల్‌స్టార్ మ‌ద్ద‌తు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts