ప్రిన్స్‌,అనుష్క‌కు దాదా సాహోబ్ ఫాల్కే అవార్డులు..!

September 21, 2019 at 3:28 pm

టాలీవుడ్ టాప్ హీరోలు ప్రిన్స్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, లెజెండ్ హీరో మంచు మోహ‌న్‌బాబు, అందాల తార అనుష్క శెట్టిల‌కు ఇప్పుడు ఓ అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్నారు. తెలుగు చిత్ర‌సీమ ప‌రిశ్ర‌మ‌కు ఈ ఏడాది ముగ్గురు అణిముత్యాల‌ను ఎంపిక చేసి తెలుగు చిత్ర‌సీమ కీర్తికిరిటంలో మ‌రో మూడు వ‌జ్రాల‌ను చేర్చారు. భార‌తీయ సినిమా గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటిన లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే పేరిట నెల‌కొల్పిన దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019కి వీరిని ఎంపిక చేశారు.

ఫాల్కే 150వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ ముగ్గురిని ఈ అవార్డుల‌కు ఎంపిక చేయ‌డ‌మే కాకుండా వీటిని వారికి అందించారు. భ‌ర‌త్ అనే నేను చిత్రానికి గాను మ‌హేష్‌బాబును ఎంపిక చేయ‌గా ఆయ‌న భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ అందుకున్నారు. ఇక భాగ‌మ‌తి సినిమాలో న‌ట‌న‌కు గాను అనుష్క ఉత్త‌మ న‌టిగా ఎంపిక‌య్యారు. ఈ పుర‌స్కారాన్ని ఆమే స్వ‌యంగా అందుకున్నారు. ఇక క‌లెక్ష‌న్ కింగ్‌గా టాలీవుడ్‌లో కీర్తి గ‌డిస్తున్న మంచు మోహ‌న్‌బాబు కు జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారాన్ని అందించారు.

ఈ ముగ్గురు న‌టుల‌తో పాటు రంగ‌స్థ‌లం చిత్రానికి దర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్‌, సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్‌, ఆర్ ఎస్ 100 చిత్రంలో న‌ట‌న‌కు గాను హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ల‌కు పుర‌స్కారాల‌ను అందుకున్నారు. ఆరుగురికి ఓకేసారి సౌత్‌లో పుర‌స్కారాలు రావ‌డం ప‌ట్ల తెలుగు చిత్రసీమలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. పుర‌స్కారాలు అందుకున్న న‌టీన‌టుల‌కు తెలుగు జ‌ర్న‌లిస్టు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది..

ప్రిన్స్‌,అనుష్క‌కు దాదా సాహోబ్ ఫాల్కే అవార్డులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts