మెగా హీరోల‌ను వెంటాడుతున్న వివాదాలు…!

September 21, 2019 at 12:21 pm

టాలీవుడ్‌లో మెగాస్టార్ కుటుంబ హీరోల‌కే వ‌రుస‌గా టైటిల్స్‌, సినిమాలు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇప్ప‌టి మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ వ‌ర‌కు సినిమాల వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మ‌రి ఎందుకు ఈ మెగా హీరోల‌కే ఈ వివాదాలు ముసురుకుంటున్నాయి. మెగా హీరోల సినిమా పేర్లు, పాట‌లు, వేశాలు కూడా వివాదాలు అలుముకోవ‌డంతో అంత‌ర్యం ఏంటో అంతుబ‌ట్ట‌ని విష‌య‌మే.. వివాదాలు నెల‌కొన్ని కొన్నింటిపై ఓ లుక్కేద్దాం…

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం సైరా. ఈ చిత్రం విషయంలోనూ ఉయ్యాలవాడ కుటుంబీకులకు నిర్మాత రామ్ చ‌ర‌ణ్ తేజ్‌కు నడుమ మధ్య జరుగుతున్న వివాదం కూడా తెలిసిందే. ఈ వివాదం ఓ కొల‌క్కిరాలేదు. దీనికి తోడు మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన వాల్మీకి సినిమా టైటిల్‌పై బోయ‌కుల‌స్తులు అభ్యంత‌రాలు తెలుపుడం తెలిసిందే. బోయ‌కుల‌స్తులు ఏకంగా కోర్టుకు వెళ్ళ‌డం, బీజేపీ నేత‌లు రంగంలోకి దిగ‌డం, అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ సినిమాను బ్యాన్ చేయ‌డం, దీంతో వాల్మీకి సినిమా ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్ సినిమా పేరును గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా మార్చ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఇక పోతే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో న‌టించిన చిత్రం కొమ‌రం పులి. ఈ చిత్రం టైటిల్‌పై పెద్ద ఎత్తున వివాదాల సాగాయి. కొమ‌రం పులి సినిమా టైటిల్‌ను మార్చాల‌ని, మా ఆరాద్య‌దైవం కొమ‌రం భీమ్‌ను అవ‌మానించేలా సినిమా టైటిల్ ఉంద‌ని ఆందోళ‌నలు జ‌రిగాయి. దీంతో త‌ప్ప‌ని స్థితిలో సినిమా టైటిల్ నుంచి కొమ‌రం ను తొల‌గించి, పులి పేరుతోనే సినిమాను విడుద‌ల చేశారు. ఇక ఇదే ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన అజ్ఞాత‌వాసి సినిమాలో ఓ పాట కొడుకా కోటేశ్వ‌ర‌రావు అనేది ఉంటే కోటేశ్వ‌ర‌రావు అనే వ్య‌క్తి కోర్టుకు వెళ్ళాడు..

ఇక మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మ‌గ‌ధీర‌, రంగ‌స్థ‌లం సినిమాల్లోని పాట‌లు కూడా వివాద‌ల న‌డుమ చిక్కుకున్నాయి. రంగ‌స్థలంలో గొల్ల‌బామ అనే ప‌దం తొల‌గించాల‌ని, మ‌గ‌ధీర‌లో ఏం పిల్ల‌డో ఎల్ద‌మెస్త‌వా అనేది తీసేయాల‌య‌ని వివాదాలు న‌డిచాయి. దీనికి తోడు స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన డీజే సినిమాలో బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచార‌ని వివాదం న‌డిచింది.. ఇలా మెగాకుటుంబాల‌కే ఇలా వివాదాలు చెల‌రేగ‌డం విశేష‌మే మ‌రి.

మెగా హీరోల‌ను వెంటాడుతున్న వివాదాలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts