ఏనుగు దంతాల కేసులో మోహ‌న్ లాల్..!

September 21, 2019 at 12:38 pm

కేర‌ళ మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ భారీ చిక్కుల్లో ఇరుక్కున్నారు. కేర‌ళ అట‌వీ శాఖ అధికారులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. చార్జ్‌షీట్ కూడా దాఖ‌లు చేశారు. 2012 నాటి ఈ కేసుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఏనుగు దంతాల‌తో చేసిన క‌ళాకృతుల‌ను అక్ర‌మ ప‌ద్ధ‌తిలో సేక‌రించిన త‌న ఇంట్లో ఉంచుకున్నార‌ని అప్ప‌ట్లో అట‌వీ శాఖ‌కు చెందిన‌ పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

ఈ క్ర‌మంలోనే మోహ‌న్‌లాల్ ఇంట్లో రెండు మూడు సార్లు త‌నిఖీలు కూడా చేప‌ట్టారు. ఎలాంటి బిల్లులు క‌ట్ట‌కుండా త‌న ఇంట్లో ఉంచుకున్న ఏనుగు దంతాల‌తో చేసిన క‌ళాకృతుల‌ను బారీ సంఖ్య‌లో స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు అట‌వీ చ‌ట్టంలోని వన్య ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం సెక్ష‌న్ 39(3) ప్ర‌కారం కేసులు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి కొన‌సాగిన విచార‌ణ‌కు తాలూకు వివ‌రాల‌ను తాజాగా చార్జ్ షీట్ రూపంలో కోర్టుకు అంద‌జేశారు.

ఎర్నాకులంలోని పెరుంబ‌వూర్ కోర్టులో శుక్ర‌వారం ఈ కేసుకు సంబంధించి ప‌క్కా ఆధారాల‌తో మోహ‌న్‌లాల్‌పై ఛార్జ్‌షీట్‌ను అట‌వీ అధికారులు కోర్టుకు స‌మ‌ర్పించారు. ప్ర‌భుత్వ సంప‌ద‌ను ఎలాంటి అనుమ‌తులు లేకుండా ఇంట్లో పెట్టుకున్నార‌నే నేరంపై దాఖ‌లైన ఈ చార్జ్‌షీట్‌పై విచార‌ణ జ‌రిగితే.. మోహ‌న్‌లాల్ చిక్కుల్లో ప‌డ్డ‌ట్టేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ఏనుగు దంతాల కేసులో మోహ‌న్ లాల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts