ఆ హీరో సినిమాలో విల‌న్‌గా న‌టించ‌నున్న హీరో నానీ…!

September 11, 2019 at 12:37 pm

సిని ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రి స‌పోర్టు లేకుండా అడుగు పెట్టిన ఈ హీరో ఇప్ప‌టికి త‌న ద‌శాబ్దంన్న‌ర‌ కేరీర్‌ను విజ‌య‌వంతంగా ముగించుకున్నాడు. ఈ హీరోతో సినిమాలు చేసిన నిర్మాత‌లు గాని, ద‌ర్శ‌కులు గాని ఇబ్బందులు ప‌డిన దాఖాలాలు లేవ‌నే టాక్ ఉంది. ఈ హీరోతో సినిమాలు చేస్తే మినిమ‌మ్ గ్యారంటీ అని అంద‌రికి న‌మ్మ‌కం. అందుకే చిన్న చిత్రాల‌ను ప్రేమించే ప్రేక్ష‌కులు కాని, ఇటు నిర్మాత‌లు గాని ఎలాంటి ఆలోచ‌న లేకుండా సినిమాల‌ను ప్రేమిస్తారు.

అయితే ఈ హీరో ఇప్పుడు విల‌న్‌గా న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నాడా.. ఈ హీరో చేసిన సినిమాలు దాదాపుగా ఓకే యావ‌రేజ్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉంటాయి. అలాంటి ఈ హీరో ఇప్పుడు విల‌న్‌గా ఎందుకు మారాల‌నుకుంటున్నాడు.. త‌నే స్వ‌యంగా విల‌న్‌గా న‌టిస్తాన‌ని ఓ హీరోకు మాటివ్వ‌డం ఇప్పుడు సిని ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కు విల‌న్‌గా న‌టించ‌బోయే హీరో ఎవ‌రో తెలుసా… అత‌ను ఎవ‌రో కాదండోయ్‌.. నేచుర‌ల్ స్టార్ నానీ.

నేచుర‌ల్ స్టార్ నానీ విల‌న్‌గా న‌టించ‌డ‌మా.. ఇది న‌మ్మ‌లేని నిజం క‌దా.. అంతేకాదండోయ్ తాను విల‌న్‌గా న‌టించేది త‌న సినిమా గ్యాంగ్‌లీడ‌ర్‌లో విల‌న్‌గా న‌టించిన కార్తికేయ సినిమాలో. నానీ గ్యాంగ్‌లీడ‌ర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.. నా గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో కార్తికేయ విల‌న్‌గా న‌టించాడు.. నేను హీరోను.. కానీ మ‌రోమారు ఇద్ద‌రం క‌లిసి న‌టిస్తే.. అది కార్తికేయ హీరోగా న‌టించే సినిమాలో నేను విల‌న్‌గా న‌టిస్తాన‌ని మాటిచ్చాడు.. అంటే కార్తికేయ‌, నానీల కాంబినేష‌న్ రివ‌ర్స్ కానున్న‌ద‌న్న‌మాట‌.

ఆ హీరో సినిమాలో విల‌న్‌గా న‌టించ‌నున్న హీరో నానీ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts