గ్యాంగ్‌లీడ‌ర్‌కు సెన్సార్ స‌మ‌స్య‌లు..!

September 11, 2019 at 11:26 am

నేచుర‌ల్ స్టార్ నానీ నటించిన గ్యాంగ్‌లీడ‌ర్‌కు ఇప్పుడు సెన్సార్ స‌మ‌స్య‌లు త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే సెన్సార్ స‌మ‌స్య‌ల‌ను తీర్చుకోవాల్సిన చిత్ర యూనిట్ వ‌రుస సెలవులు వ‌స్తున్నా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా వ్య‌వ‌హరించ‌డంతో ఇప్పుడు సెన్సార్ స‌మ‌స్య‌కు దారి తీసింద‌నే టాక్ వినిపిస్తుంది. వాస్త‌వానిని నానీ గ్యాంగ్ లీడ‌ర్ సినిమా సెన్సార్ స‌మ‌స్య‌లు తీర్చుకుంద‌నుకున్నారు. అయితే ఇప్పుడు సెన్సార్ ఈ రోజు అంటే బుద‌వారానికి టైం ఇచ్చార‌ట‌.

ఇప్పుడు నానీ గ్యాంగ్‌లీడ‌ర్ కు ఏర్ప‌డిన స‌మ‌స్య తీరాలంటే ఈరోజు సెన్సార్ పూర్తి కావాలి.. లేదా రేపైనా కావాలి లేకుంటే సినిమా విడుద‌ల‌కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. అయితే ఇక్క‌డ గ్యాంగ్‌లీడ‌ర్‌కు ఓ అడ్వాంటేజ్ ఉంద‌ట‌నే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు ఎక్కువ సెన్సార్ స‌మ‌స్య ఉండ‌క‌పోవ‌చ్చ‌నేది టాక్‌. వాస్త‌వానికి సినిమాకు సంబంధించిన వ్య‌వ‌హారాలు ముంబై నుంచి జ‌రుగుతుంటాయి. అవి వెంట‌నే అయిపోయేలా చిత్ర యూనిట్ చ‌ర్య‌లు తీసుకుంటే శుక్ర‌వారం థియోట‌ర్ల‌లో బొమ్మ ప‌డ‌టం ఖాయ‌మే.

అయితే నేచుర‌ల్ స్టార్ నానీ సినిమాకు సంబంధించిన వ్య‌వ‌హ‌రాల‌పై ఓ ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌డమే కార‌ణ‌మ‌ట‌. వాస్త‌వానికి ఈ సినిమా విడుదల కావ‌డానికి కార‌ణం కేవ‌లం సాహో సినిమా రావ‌డమే. సాహో సినిమా కోసం నానీ త‌న గ్యాంగ్‌లీడ‌ర్ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల కోసం కేవ‌లం ఉన్న అడ్డంకి సెన్సార్ స‌ర్టిఫికెటే…

గ్యాంగ్‌లీడ‌ర్‌కు సెన్సార్ స‌మ‌స్య‌లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts