నాని గ్యాంగ్ లీడ‌ర్ రివ్యూ ..బొమ్మ హిట్టా పట్టా ?

September 13, 2019 at 11:01 am

బ్యాన‌ర్‌: యూవీ క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: నాని, ప్రియాంక అరుళ్‌మోహ‌న్‌, కార్తీకేయ‌, ల‌క్ష్మి త‌దిత‌రులు
మ్యూజిక్‌: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌
నిర్మాత‌లు: వై.న‌వీన్‌, వై.ర‌వి, చెరుకూరి మోహ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ కె.కుమార్‌
రిలీజ్ డేట్‌: 13 సెప్టెంబ‌ర్‌, 2019

నేచుర‌ల్ స్టార్ నాని, వైవిధ్య‌భ‌రిత క‌థాంశాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కేకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా గ్యాంగ్ లీడ‌ర్‌. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక్ అరుళ్ మోహ‌న్ న‌టించారు. హీరోగా నాని ఎంత ప్ర‌త్యేక‌మో.. ద‌ర్శ‌కుడిగా విక్ర‌మ్ కూడా అంతే ప్ర‌త్యేకమ‌ని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇష్క్‌, మ‌నం, 24 సినిమాలు చూసిన వారికి విక్ర‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా గ్యాంగ్‌లీడ‌ర్‌లో మ‌రో హీరో కార్తికేయ మొద‌టిసారిగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించారు. దీంతో స‌హ‌జంగానే ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెరిగాయి. అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న గ్యాంగ్ లీడ‌ర్ శుక్ర‌వారం విడుద‌ల అయింది. అయితే.. అంద‌రి అంచ‌నాల‌కు ఏమేర‌కు అందుకుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

క‌థేమిటంటే…
ఈ సినిమాలో పెన్సిల్(నాని) ఒక క‌థా ర‌చ‌యిత‌గా మారాలి అనుకుంటాడు. అయితే.. ఇదే క్రమంలోనే ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతుంది. దీనిని ఛేదించేందుకు మొత్తం ఐదుగురు ఆడవాళ్లు ఒక్క‌ట‌వుతారు. ఆ త‌ర్వాత తమ గ్యాంగ్ కు లీడర్ గా ఉండాలని నానిని కోరుతారు. స్టోరీ రైట‌ర్‌గా మారాల‌ని అనుకున్న‌ నాని ఎలా గ్యాంగ్ లీడర్‌ అయ్యాడు. మ‌రి ఈ గ్యాంగ్ ఆ దొంగ‌త‌నాన్ని ఛేదించిందా..? లేదా..? అస‌లు ఈ ఐదుగురు ఆడ‌వాళ్లు ఎందుకు ఒక్క‌ట‌వుతారు? ఈ క‌థ‌కు కార్తికేయ‌(దేవ్)కు ఉన్న సంబంధం ఏమిటి..? ఇక నానికి, హీరోయిన్ ప్రియాంకాల మ‌ధ్య ల‌వ్ ఎలా పుడుతుంది..? ఈ క్ర‌మంలో ఎలాంటి మ‌లుపులు వ‌చ్చాయి..? అన్నది తెలుసుకోవాలంటే మాత్రం సినిమాను చూడాల్సిందే మ‌రి.

ఎలా ఉందంటే…
మ‌రోసారి తానంటే ఏమిటో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ నిరూపించుకున్నార‌నే చెప్పొచ్చు. నిజానికి.. సినిమా ప్రారంభంలో కొంత నెమ్మ‌దిగా ఉన్న‌ట్లు అనిపించినా.. స‌మ‌యం గ‌డిచే కొద్దీ వ‌చ్చే మ‌లుపులు.. పాత్ర‌లు.. ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయి. ఆ ఐదుగురు ఆడ‌వాళ్లు, నానిల మ‌ధ్య వ‌చ్చే ప‌లు స‌న్నివేశాలు, వెన్నెల కిశోర్ మార్క్ సీన్స్‌ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్ న‌వ్వులు పూయిస్తాయి. ఇక నాని, ప్రియాంకాల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. ఇక ఇందులో ప్ర‌ధానంగా దొంగ‌త‌నం ఛేదించే క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగుతాయని చెప్పొచ్చు. ఒక సీన్ చూస్తుండ‌గా.. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందా..? అనే ఫీలింగ్ ప్రేక్ష‌కుడిలో క‌లుగుతుంది. ఇక్క‌డ మ‌రొక అంశం ఏమిటంటే.. కార్తికేయ ఎంట్రీ త‌ర్వాత ప్రేక్ష‌కుడిలో మ‌రింత థ్రిల్ క‌లుగుతుంది.

ఎవ‌రెలా చేశారంటే…
ఈ సినిమాలో అంద‌రూ త‌మ‌త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశార‌నే చెప్పొచ్చు. ఇక నాని మ‌రోసారి త‌నదైన న‌ట‌న‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడు. సినిమా మొత్తానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. హీరోయిన్ ప్రియాంకా కూడా త‌న పాత్ర‌కు నూటికినూరుశాతం న్యాయం చేసింది. కార్తికేయ నెగెటివ్ షేడ్‌లో అద‌ర‌గొట్టాడు. ఇక వెన్నెల కిశోర్ త‌న‌దైన మార్క్ కామెడీతో మంచి మార్కులు కొట్టేశాడ‌ని చెప్పొచ్చు. ఇక అనిరుద్ అందించిన సంగీతం సినిమాకు అద‌న‌పు బ‌లాన్ని ఇచ్చింద‌ని చెప్పొచ్చు.

ప్ల‌స్‌లు, మైన‌స్‌లు ఇవే…
నాని మరియు కార్తికేయల పెర్ఫామెన్స్‌తో పాటు సినిమా క‌థ, కథనాలు, కథానుసారం వచ్చే ట్విస్టులు
అనిరుధ్ నేప‌థ్య సంగీతం, నిర్మాత‌ల ఖ‌ర్చు, సినిమాటోగ్ర‌ఫీ బాగున్నాయి. మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే
అక్కడక్కడ నెమ్మదించిన కథనం.. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సీన్స్ తగ్గించడం

ఫైన‌ల్‌గా…
మొత్తానికి గ్యాంగ్ లీడ‌ర్ ప్రేక్ష‌కుల‌ను బాగానే మెప్పించ‌డ‌నే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో హీరో నాని మ‌రోహిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ట్టేన‌ని ప్రేక్షకులు అంటున్నారు. చూడాలి మ‌రి వ‌సూళ్లు ఏలా ఉంటాయో..!

గ్యాంగ్‌లీడ‌ర్ TJ రేటింగ్‌: 3 / 5

నాని గ్యాంగ్ లీడ‌ర్ రివ్యూ ..బొమ్మ హిట్టా పట్టా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts