నాని ‘ గ్యాంగ్‌లీడ‌ర్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌…హిట్టా…ఫ‌ట్టా

September 13, 2019 at 10:25 am

నేచుర‌ల్ స్టార్ నాని – స్క్రీన్ ప్లే మాస్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో మొదటిసారి తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ ఇద్ద‌రు చేసిన గ‌త సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించినంత‌గా ఆడ‌క‌పోవ‌డంతో వీరిద్ద‌రు ఈ సినిమాపై మంచి అంచ‌నాలు పెట్టుకున్నారు. గ్యాంగ్‌లీడ‌ర్‌తో హిట్ కొట్టేందుకు వీరు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఇక శుక్ర‌వారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన గ్యాంగ్‌లీడ‌ర్ ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకుంది.

ఇక సినిమాలో కామెడీ, పంచ్‌లు అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. కామెడీ సీన్ల‌ను మ‌ధ్య‌లో ఇరికించిన‌ట్టు కాకుండా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ మంచి కామెడీ ఎపిసోడ్స్ క్రియేట్ చేసుకుని మ‌రీ సినిమాను తెర‌కెక్కించాడు. మంచి టైమింగ్‌తో వ‌చ్చే డైలాగ్స్ బాగా పేలాయి. ఓవ‌రాల్‌గా విక్ర‌మ్ కె.కుమార్ త‌న మ్యాజిక్ స్క్రీన్ ప్లేతో మెప్పించాడు. చాలా రోజుల త‌ర్వాత తెర‌పై ఓ అదిరిపోయే ట్విస్ట్ చూసిన ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది.

నాని నుంచి మ‌ళ్లీ ఓ ఫుల్ టైం ఎంట‌ర్టైన్‌మెంట్ రోల్ గ్యాంగ్‌లీడ‌ర్ ద్వారా వ‌చ్చింది. పెన్సిల్ పార్థసారథిగా సరికొత్త కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇక యువ‌హీరో కార్తీకేయ మొద‌టి సారి ఓ నెగిటివ్ రోల్‌లో న‌టించి సినిమాకు మెయిన్ పిల్ల‌ర్‌గా ఉన్నాడు. ఇక హీరోయిన్ అరుళ్ మోహ‌న్‌తో పాటు ఇతర నటినటులు వారి పాత్రలకు తగ్గట్టు కథలో మంచి నటనను కనబరిచారు.

ఇక ప్ర‌ధానంగా చిన్న పా కీ రోల్ ప్లే చేసి సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఇక సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి మంచి బూస్ట్ ఇచ్చింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వెళితే గ్యాంగ్‌లీడ‌ర్‌తో మంచి ఫ‌న్ దొర‌క‌డం ఖాయం. బాక్సాఫీస్ వ‌ద్ద గ్యాంగ్‌లీడ‌ర్‌తో నాని ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తాడో ? చూడాలి.

నాని ‘ గ్యాంగ్‌లీడ‌ర్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌…హిట్టా…ఫ‌ట్టా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts