భారీ లీక్‌తో షాకిచ్చిన గ్యాంగ్‌లీడ‌ర్‌..!

September 11, 2019 at 6:11 pm

నేచుర‌ల్ స్టార్ నానీ న‌టించిన చిత్రంకు సంబంధించిన ఓ భారీ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ లీక్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. నానీ న‌టించిన గ్యాంగ్‌లీడ‌ర్ కు సంబంధించిన ఆప్‌డేట్స్ ఏమి ఇవ్వ‌కుండా ఎలాంటి సౌండ్ లేకుండానే సినిమాను ఈనెల 13న విడుద‌ల చేయ‌నున్న త‌రుణంలో ఓ భారీ లీక్ ఇచ్చి అంద‌రిని స‌ర్‌ప్రైజ్‌కు గురి చేసింది. అంటే సినిమా విడుదల చేయ‌బోయే ముందు సినిమాపై ఆస‌క్తి క‌లిగించాల‌నే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ కావాల‌ని చేసిందా.. లేక యాదృచ్చిక‌మా తేలియాల్సి ఉంది.

అయితే సినిమాకు సంబంధించి ఇచ్చిన భారీ లీక్ ఏమై ఉంటుంద‌నే క‌దా మీ డౌట్‌.. గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాలో నానీ సినిమాలు చూస్తే క‌థ‌ల‌ను కాపీ కొట్ట‌డం, వాటిని బుక్స్‌గా ప్రింట్ చేయ‌డం, వీటిని చ‌దివిన ఓ ఐదుగురు త‌మ రీవెంజ్ కోసం నానీని క‌ల‌వ‌డం వంటి క‌థ‌నాలు వెలుడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నానీ డ‌బుల్ యాక్ష‌న్ గా న‌టిస్తున్నాడ‌నే ట్వీస్ట్‌ను బ‌య‌ట‌పెట్టారు చిత్ర యూనిట్‌. ఇందులో పెన్సిల్ పార్థ‌సార‌ధి పాత్ర ఒక‌టి కాగా, మ‌రో పాత్ర‌ను గుట్టుగా ఉంచార‌ట‌..

ఇక ఈ చిత్రంలో విల‌న్ కార్తికేయ ఓ రేస‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని ఇంత‌కు ముందు క‌థ‌నాలు వ‌చ్చిన‌వే. అయితే అయితే అత‌డు ఓ భారీ దొంగ‌త‌నానికి ప్లాన్ చేస్తాడ‌ట‌. ఈ దొంగ‌త‌నం ప్లాన్ అమ‌లు చేసే సంద‌ర్భంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌తో సినిమా ముందుకు సాగుతుంద‌ట‌.. అయితే ఇంకో ట్వీస్ట్ ఏంటంటే ఈ సినిమా కొరియన్ సినిమా అయినా ‘గర్ల్ స్కౌట్స్’ కి ఈ చిత్రం రీమేక్ అట. సో నానీ సినిమాకు సంబంధించిన ట్వీస్ట్ లు ఇలా లీక్ చేయ‌డంలో చిత్ర యూనిట్ ఉద్దేశ్యం ఏంటో అంతు చిక్క‌డం లేదు…

భారీ లీక్‌తో షాకిచ్చిన గ్యాంగ్‌లీడ‌ర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts