బూతు సినిమాలో లేడీ సూప‌ర్‌స్టార్‌…!

September 21, 2019 at 4:18 pm

హ‌లీవుడ్ చిత్రాల సంస్కృతికి ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వ‌ర‌కు పాకింది. హాలీవుడ్ చిత్రాల్లో లిఫ్ లాక్‌లు, బ‌రితెగించిన రోమాన్స్‌, ప‌డ‌క సీన్ల‌లో బోల్డ్‌గా క‌నిపించడం. ఇంకా చెప్పాలంటే నీలి చిత్రాల‌ను చూసిన ఫీలింగ్ క‌లిగేది. అయితే ఇప్ప‌డు హాలీవుడ్ చిత్రాల రేంజ్‌లో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో బోల్డ్ సినిమాలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల అమ‌లాపాల్ న‌టించిన చిత్ర‌మే నిద‌ర్శ‌నం.

ఇటీవ‌ల అమ‌లాపాల్ న‌టించిన చిత్రం ఆమే.. ఇందులో ఆమే బోల్డ్ గా న‌టించిన విమ‌ర్శ‌ల పాలైంది. అంతే కాదు సినిమా కూడా అనుకున్నంత రేంజ్‌లో ఆడ‌లేక పోయింది. అయితే ఇప్పుడు అదే త‌ర‌హాలో మ‌రో బోల్డ్ కంటెంట్ తో భారీ రోమాన్స్ పండించేందుకు లేడీ సూప‌ర్‌స్టార్‌గా కీర్తిని అందుకుంటున్న న‌టి న‌టించేందుకు సిద్ధ‌మైంద‌నే టాక్ ఫిలింన‌గ‌ర్‌లో చెక్క‌ర్లు కొడుతుంది. ఇంత‌కు ఎవ‌రా లేడీ సూప‌ర్‌స్టార్ అనుకుంటున్నారా.. ఇంకేవ‌రు న‌య‌న‌తార‌.

న‌య‌న‌తార టాప్‌ హీరోల‌తో స‌మానంగా పారితోషికం అందుకుంటున్న ఏకైక తార‌. ఆమే ఇటీవ‌ల ఓ బోల్డ్ కంటెంట్ వున్న సినిమాకు ఓకే చెప్పిందని తెలిసింది. మిలింద్‌ రౌ దర్శకత్వంలో, రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నయన్‌ ప్రియుడు విగ్నేశ్‌ శివన్‌ ‘నెట్రికన్‌’పేరుతో నిర్మిస్తున్న చిత్రంలో నయన నటిస్తుందట. ఈ చిత్రంలో సెక్స్,మాఫియా,రొమాన్స్,హింస భారీ స్థాయిలో ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్‌లో న‌య‌న‌తార బోల్డ్ న‌టించేలా క‌నిపిస్తుంది. సో చిత్రం విడుద‌ల అయితే త‌ప్ప ఏది నిజ‌మో తెలియ‌దు..

బూతు సినిమాలో లేడీ సూప‌ర్‌స్టార్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts