ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆ ద‌ర్శ‌కుడి సంచ‌ల‌న కామెంట్లు…!

September 16, 2019 at 6:27 pm

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈపేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. సినిమాల్లో ఓ కొత్త ట్రెండ్ క్రియోట్ చేసిన న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్‌కు ఓ ప్ర‌త్యేక క్రేజ్‌ను తెచ్చాడు. అయితే అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఇప్పుడు ఓ యువ ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న కామెంట్ చేశాడు. ఈ ద‌ర్శ‌కుడు చేసిన కామెంట్‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అదే హాట్ టాపిక్‌గా మారింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆ యువ ద‌ర్శ‌కుడు చేసిన కామెంట్లు ఏమిటీ.. ఇంత‌కు ప‌వ‌న్‌పై కామెంట్ చేసిన ద‌ర్శ‌కుడు ఎవ‌రు.. అంటే మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌తో వాల్మీకి చిత్రాన్ని రూపొందిస్తున్న యువ ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్‌. మ‌రి ఈ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్‌పై ఏ కామెంట్ చేశాడు.. వాల్మీకి ఫ్రీరిలీజ్ ఈవెంట్‌లో హ‌రీష్ శంక‌ర్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు అని ప్ర‌శ్నించారు మెగా అభిమానులు. దీంతో స్పందించిన ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్‌ మీరు విజిల్స్ వేసి, కేకలు పెడితే కుదరదు. అది జరగాలని అభిమానులంతా బలంగా కోరుకోండి.. అయిపోద్ది అని హరీష్ శంకర్ కామెంట్స్ చేశాడు.

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ గ‌తంలో ప‌వ‌న్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు స‌న్న‌ద్ధం అయినాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో న‌టిస్తూనే జ‌న‌సేన అనే పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ పోటి చేయ‌కుండా టీడీపీ, బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. దీంతో ఆపార్టీలు అధికారంలోకి వ‌చ్చాయి.. త‌రువాత 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. అయితే పార్టీ ఓడిపోయిన త‌రువాత సినిమాల్లో న‌టిస్తాడ‌ని అంతా అనుకున్నారు. కానీ రాజ‌కీయాల‌పైనే ప‌వ‌న్ దృష్టి పెట్టాడు. దీంతో హ‌రీష్ శంక‌ర్ కోరిక తీర‌కుండానే పోయింది. ప‌వ‌న్ ఎప్పుడు సినిమాల్లోకి వ‌స్తాడా.. ఎప్పుడు అవ‌కాశం వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్‌.. సో ఆయ‌న కోరిక‌, అభిమానులు కోరిక తీరాల‌ని కోరుకుందాం..

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆ ద‌ర్శ‌కుడి సంచ‌ల‌న కామెంట్లు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts