ఆ పుస్త‌క‌మే ప‌వ‌న్ ను మార్చింద‌ట‌…!

September 18, 2019 at 4:42 pm

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఓ రాజ‌కీయ నాయ‌కుడు.. కానీ అంత‌కు ముందు సినిమా స్టార్‌గా టాలీవుడ్‌ను ఏలిన హీరో. టాలీవుడ్‌లో ప‌వ‌నిజం అంటూ ఓ ట్రెంట్‌ను సృష్టించిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఒక పుస్త‌క‌మే మార్చేసింద‌ట‌. ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింద‌నే ఓ పాపుల‌ర్ డైలాడ్‌ను విని ఉంటాం మ‌నం. కాని ఒక పుస్త‌కం నా పంథానే మార్చింద‌ని చెపుతున్నాడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఇంత‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మార్చిన ఆ పుస్త‌కం ఏంటిది.. దాన్ని ఎవ‌రు ర‌చించారు.. ఆ పుస్త‌కంలో ఉన్నది ఏమిటి అనేది ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖాళీ స‌మ‌యంలో ప్ర‌కృతితో గ‌డ‌ప‌డం లేదా ఏదైనా ఓ పుస్త‌కం చ‌ద‌వ‌డం ఇష్ట‌మ‌ని అనేక‌సార్లు చెప్ప‌డం మ‌నం విన్నాం. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెట్ల‌పై ప్రేమ‌ను పెంచ‌డానికి ఓ పుస్త‌క‌మే ప్రేర‌ణ‌గా నిలిచింద‌నే స‌త్యం తెలిసింది.

ఇంత‌కు ఆ పుస్త‌కం పేరు చెప్ప‌లేదు క‌దూ.. ఆ పుస్తకం పేరు వనవాసి. బనవాసి (తెలుగులో వనవాసి) అనే పుస్తకాన్ని 1938లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రచించారని, దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని పేర్కొన్నారు. ప‌వ‌న్ చిన్న‌ప్పుడు మద్రాస్ బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొన్నాడ‌ట‌. అయితే ఇటీవ‌ల న‌ల్ల‌మ‌ల్ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోరాటం చేస్తున్న త‌రుణంలో ఈ పుస్త‌కంతో ప్రేర‌ణ పొందాన‌ని చెప్ప‌డం విశేషం.

ఆ పుస్త‌క‌మే ప‌వ‌న్ ను మార్చింద‌ట‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts