ప‌వ‌న్ కేసీఆర్ టార్గెట్ వెన‌క‌..!

September 19, 2019 at 3:15 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మ‌ళ్లీ తెలంగాణ‌పై దృష్టి సారించారు. ఇప్పటి దాకా ఏపీ రాజధాని అ మరావతి గురించి గ‌ళ‌మెత్తిన ఆయ‌న .. తాజాగా న‌ల్ల‌మ‌ల‌లో యురేనియం వివాదంపై స్పందించారు. అంతేకాదు యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నల్లమల చెంచులపై ప్రత్యేక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా అస‌లు ప‌వ‌న్ స‌డెన్ గా తెలంగాణ‌పై న‌జ‌ర్ పెట్ట‌డం, అధికార టీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు సంధించ‌డం వెనుక అస‌లు కార‌ణాలేంట‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రకృతిని బలిపశువుగా వాడుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని పణంగా పెట్టి ప్రభుత్వాలు లాభం పొం దాలని చూస్తే ఉరుకోబోమని జనసేనాని హెచ్చరించారు. తాజాగా యురేనియం తవ్వకాలపై తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. గతంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చి.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.

ప‌వ‌న్ తీరు చూస్తే.. తెలంగాణ రాజకీయాల్లో మ‌ళ్లీ కీల‌కంగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం యురేనియం త‌వ్వ‌కాల అంశాన్ని ఆయ‌న అస్త్రంగా మ‌లుచుకుంటున్న‌ట్లు స‌మాచారం. యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే పోరాటంలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించి త‌ద్వారా రాష్ట్రంలో పాగా వేయాల‌నేది ప‌వ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇదే క్ర‌మంలో రాష్ట్రంలో అధికార టీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని నిల‌బెట్టాల‌నుకుంటున్నారా అనే అనుమానాలు క‌లుగు తున్నాయి.

ఏదేమైనా అఖిల పక్ష నేతలతో పవన్ భేటీ కావడం వెనుక అస‌లు ఉద్ధేశ్యం ఇదేన‌ని, లేక‌పోతే అసలు యురే నియంకి పవన్ కళ్యాణ్‌కి సంబంధమేంట‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే జనసేనాని యురేనియం పోరాటం పై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. పవన్ చేస్తున్న పోరాటానికి ప్రశంసలు కురిపించారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పవన్ ముందుకు రావడం ఆదర్శనీయంగా ఉందన్నారు. మొత్తానికి తెలంగాణ‌లో యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిపే పోరాటం జ‌న‌సేనానికి ఏమేర‌కు క‌లిసివ‌స్తుందో వేచి చూడాల్సిందే.

అసలు పవన్ కళ్యాణ్, అఖిల పక్ష నేతలను కలవడం చర్చనీయాంశం అయింది. వారిని కూడా యురేనియం పై పోరాటానికి సిద్దం చేయబోతున్నారా..? టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ముందుకు తీసుకురాబోతున్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు అఖిలపక్ష భేటీలో కేటీఆర్ వ్యాఖ్యలను పాయింట్‌గా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం పై ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. ఇంతకీ.. జనసేనాని యురేనియం పోరాటం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి మరి..

ప‌వ‌న్ కేసీఆర్ టార్గెట్ వెన‌క‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts