ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు విజయ్ దేవరకొండ స‌పోర్టు..!!

September 12, 2019 at 5:21 pm

ఆయ‌న ఓ ప‌వ‌ర్‌స్టార్‌.. టాలీవుడ్‌లో ప‌వ‌నిజాన్ని తెచ్చిన హీరో.. ఆయ‌న అడుగుతీసి అడుగేస్తే అభిమానుల హడావుడే వేరు.. అంత‌లా పాతుకుపోయిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు ఓ విష‌యంలో రౌడీ హీరోగా అభిమానంగా పిలుచుకునే విజ‌య్ దేవ‌ర‌కొండ స‌పోర్టుగా నిలిచాడు.. ఓవిష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తోడుగా తాను మ‌ద్ద‌తు ఉంటాన‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించాడు.. ఇంత‌కు ఏ విష‌యంలో ప‌వ‌ర్‌స్టార్‌ను రౌడీ హీరో స‌పోర్టు చేస్తున్నాడంటే…

నల్లమల అడవుల్లోని యురేనియం తవ్వకాలకు సంబంధించిన అంశం గత కొన్ని రోజులుగా మీడియాలో నిలిచింది. నల్లమలలో ఈ తవ్వకాలను చేపట్టకూడదని, తవ్వకాలు చేపడితే. దాని వలన పర్యావరణంలో సమతుల్యత లోపిస్తుందని, భవిష్యత్ తరాల ప్రజలు ఇబ్బందులు పడతారని అంటూ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ కళ్యాణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు యురేనియం తవ్వకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ సేవ్ నల్లమల అంటూ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేక‌ ఉద్య‌మానికి ఊత‌మిస్తూ, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేవ‌నెత్తిన ఈ పోరాటానికి మద్దతుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కూడా గొంతు కలిపాడు. సోషల్ మీడియా ద్వారా తన మద్దతు తెలిపారు. నల్లమల అడవిని కాపాడుకోవడానికి ఆంధ్రా, తెలంగాణలోని అన్ని పార్టీలు ముందుకు రావాలని, నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేసే వరకు ఉద్యమం చేయాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. 2000 ఎక‌రాల్లోని న‌ల్ల‌మ‌ల అడ‌విని ప‌రిర‌క్షించుకుందాం అంటూ ట్వీట్ చేశాడు. సో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎంత‌మంది అనుక‌రించి యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా ఊత‌మిస్తారో వేచి చూడాల్సిందే.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు విజయ్ దేవరకొండ స‌పోర్టు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts