ప్ర‌భాస్ జాన్ కోసం 25 సెట్స్ రెడీ…!

September 11, 2019 at 5:58 pm

యంగ్‌రెబ‌ల్ స్టార్ కేరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయే సినిమాలు బాహుబ‌లి1, 2. అయితే త‌రువాత న‌టించిన సాహో చిత్రం బాక్సాఫీసు రికార్డుల ప్ర‌కారం భారీ క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచిన‌ప్ప‌టికి హిట్ ప‌రంగా చూస్తే భారీ డిజాస్ట‌ర్‌గానే మిగిలిపోయింది. తెలుగునాట సాహో సినిమా బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చితే.. బాలీవుడ్‌లో మాత్రం భారీ వ‌సూళ్ళ‌ను సాధించి పాన్ ఇండియా మూవీగా నిలిచిపోయింది.

ప్ర‌భాస్ ఇప్పుడు జాన్ సినిమాను గోపి కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీనికోసం దాదాపుగా రూ. 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. 1960కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో దాదాపు 25 రకాల సెట్స్ ను నిర్మించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఈ సెట్స్ వేస్తున్నారు. ప్రతి సెట్ కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. సాహోలో మాదిరిగా భారీ క్యాస్టింగ్ ను పెట్టకుండా తక్కువ క్యాస్టింగ్ తో సినిమాను చిత్రీకరిస్తున్నారట.

అయితే సాహో నేర్పిన గుణ‌పాఠంతో ప్ర‌భాస్ కొంత త‌గ్గాడ‌నే అనిపిస్తుంది. భారీ బ‌డ్జెట్ జోలికి పోకుండా త‌క్క‌వు బ‌డ్జెట్‌లో ఎక్కువ వ‌సూలు సాధించే ప‌నిలో ప‌డ్డాడు. ఇప్ప‌టికే అభిమానుల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంపాదించుకున్న ప్ర‌భాస్ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీసినా జ‌నాలు త‌ప్ప‌కుండా చూస్తారు. దీంతో పెట్టిన పెట్టుబ‌డిని ఈజీగా రాబ‌ట్టుకోవ‌చ్చు. అందుకే సాహో త‌రువాత తాను న‌టిస్తున్న చిత్రం జాన్‌. ఈ చిత్రంపై ఇప్ప‌టికే సెట్స్‌పై ఉంది.

ప్ర‌భాస్ జాన్ కోసం 25 సెట్స్ రెడీ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts