సాయిధ‌ర‌మ్ తేజ్ ‘ప్ర‌తిరోజు పండుగే’ మోషన్ టీజర్

September 12, 2019 at 3:29 pm

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం ప్ర‌తిరోజు పండుగే. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్‌ నటిస్తున్న ప్రతిరోజూ పండగే ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు.

అయితే తాజాగా మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుద‌ల చేశారు. ఈ లుక్ లో స‌త్య‌రాజ్ జంప్ చేస్తుంటే సాయిధ‌ర‌మ్ తేజ్ నాన్నా ప‌డిపోతావు అన్న‌ట్టుగా ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చాడు. మోష‌న్ పోస్ట‌ర్‌లో చేతిలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, స‌త్య‌రాజ్‌లు గొడుగులు ప‌ట్టుకుని ఉన్నారు. జోరుగా కురుస్తున్న వ‌ర్షంలో వారు ఓ బ్రిడ్జిపై నుంచి వెళుతున్న క్ర‌మంలో తండ్రి ఓ మ‌యూరిలా ఆనందంతో కేరింత‌లు కొడుతూ గాల్లో ఎగురుతున్న పోస్ట‌ర్ చూస్తే సినిమాలో ఆనంద స‌న్నివేశాలకు కొదువ లేద‌నే భావ‌న క‌లుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ప్ర‌తిరోజు పండుగే క‌న్నా ముందు న‌టించిన సినిమాలు దాదాపుగా ఆవ‌రేజ్‌గా న‌డ‌వ‌డంతో సాయిధ‌ర‌మ్ తేజ్ ఢీలా ప‌డ్డాడు. స‌రైన హిట్లు లేక ఇబ్బందులు ప‌డుతున్న తేజ్‌కు ప్ర‌తిరోజు పండుగే సినిమాతోనైనా హిట్ కొట్టాల‌నే తాప‌త్ర‌యం క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్ చూస్తే సినిమాపై హైప్ క్రియోట్ అవుతుంది. సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ ‘ప్ర‌తిరోజు పండుగే’ మోషన్ టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts