ఆర్ ఆర్ ఆర్ షాకింగ్ ర‌న్ టైమ్…!

September 18, 2019 at 4:18 pm

ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళీ సినిమా ర‌న్ టైం ఎంతున్నా ప్రేక్ష‌కులు వీక్షిస్తూనే ఉంటారు. ఎందుకంటే రాజ‌మౌళీ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కులు సినిమాలో లీన‌మై పోతుంటారు. అందుకే సినిమా ర‌న్‌టైం గురించి పెద్ద‌గా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోరు. అయితే ఇటీవ‌ల వ‌స్తున్న సినిమాలు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తూ సినిమా ర‌న్‌టైమ్‌ను భారీగానే లాగుతున్నారు. దీంతో ప్రేక్ష‌కుల స‌హానానికి ప‌రీక్ష‌గా మారుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్ ఆర్ ఆర్ సినిమా ర‌న్‌టైమ్‌ను కూడా ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తున్నార‌ట ద‌ర్శ‌కుడు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ల‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇద్ద‌రు టాప్ హీరోలు న‌టిస్తున్న సినిమా కావ‌డంతో సినిమా ర‌న్ టైమ్‌ను భారీగానే ఉంచుతార‌ని అనుకుంటున్నారు అభిమానులు. అయితే ఇద్ద‌రు టాప్‌హీరోలైనా ఫ‌ర్వాలేదు.. కానీ సినిమా ర‌న్‌టైమ్ మాత్రం సాధార‌ణంగానే ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. అయితే సినిమా ర‌న్‌టైమ్ మాత్రం సాహో చిత్రం క‌న్నా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. బాహుబ‌లి, బాహుబ‌లి 2 సినిమాల ర‌న్‌టైమ్ దాదాపుగా మూడు గంట‌ల వ‌ర‌కు ఉంది. సాహో కూడా దాదాపు మూడు గంట‌ల ద‌రిదాపుల్లోనే ఉంటుంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ర‌న్ టైమ్ కూడా మూడు గంట‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు అనుకున్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ర‌న్‌టైమ్ కేవ‌లం రెండున్న‌ర గంట‌ల లోపే ఉండేలా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌.

ఆర్ ఆర్ ఆర్ షాకింగ్ ర‌న్ టైమ్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts