అజ్ఞాత‌వాసిని బ్రేక్ చేసిన సాహో..!

September 9, 2019 at 12:24 pm

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఓ ఇజం.. అది ప‌వ‌నిజం.. అలాంటి ఇజ‌మున్న న‌టుడు న‌టించిన అజ్ఞాత‌వాసి రికార్డును బ్రేస్ చేసాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్. ప‌వ‌ర్‌స్టార్‌ను బ్రేక్ చేసే సాహాసం చేశాడా ప్ర‌భాస్ అనుకుంటున్నారా.. అవును మ‌రి బ్రేక్ చేశాడు… ఎందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప్ర‌భాస్ బ్రేక్ చేశాడు… అనే ఉత్కంఠ క‌లిగిస్తుంది క‌దూ.. అదేనండీ సాహో సినిమాతో న‌ష్టాల బాట‌ప‌ట్ట‌డంలో అజ్ఞాత‌వాసిని మించిపోయాడ‌ట‌…

ఇప్పుడు ఒక టాప్ హీరో న‌టించిన సినిమా రికార్డుల‌ను బ్రేక్ చేయాల‌ని మ‌రో హీరోకు ఉండ‌టం స‌హాజం.. కాని ఈబ్రేక్ ఈవెన్ సాధించేది, రికార్డులు సాధించేది మంచిలో కాని చెడులో కాదు.. అయితే ఇక్క‌డ చెడులో సాహో అజ్ఞాత‌వాసి రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌బోతున్నాడ‌ట. ఓవ‌ర్సీస్‌లో మంచి మార్కెట్ ఉన్న హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్‌. ఈ ఇద్ద‌రు హీరోలు న‌టించిన చిత్రాలు అజ్ఞాత‌వాసి, సాహో. అయితే అజ్ఞాత‌వాసి సినిమా ఓవ‌ర్సీస్‌లో భారీ డిజాస్ట‌ర్ అయింది.

ఈ భారీ డిజాస్ట‌ర్ నుంచి తేరుకునేందుకు అక్క‌డి బయ్య‌ర్లు ఇంకా సినిమాను ఎక్క‌డైనా షోలు వేస్తే లాభాలు వ‌స్తాయ‌ని ఆశిస్తే అది చావు దెబ్బ తీస్తుంద‌ట‌.. అదే విధంగా ఇప్పుడు 43కోట్ల‌కు సాహో సినిమాను బ‌య్య‌ర్ల కొన్నార‌ట‌. ఇప్పుడు అక్క‌డ సాహో సినిమా అట్ట‌ర్ ప్లాప్‌గా మార‌డంతో బ‌య్య‌ర్లు దాదాపుగా భారీ న‌ష్టాల‌నే చ‌విచూస్తున్నార‌ట‌. దీంతో బ‌య్య‌ర్లు నిర్మాత‌ల వెంట‌ప‌డుతున్నార‌ట‌. ఇక తెలుగులో కూడా భారీ న‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ట‌. ఇక్క‌డైతే ఏకంగా రూ.60కోట్లకు పైగా సాహో న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ట‌.. అంటే అజ్ఞాత‌వాసిని మించి పోతున్నాడ‌న్న‌మాట‌.

అజ్ఞాత‌వాసిని బ్రేక్ చేసిన సాహో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts