భారీ న‌ష్టాల దిశ‌గా సాహో ప‌య‌నం..!

September 4, 2019 at 1:34 pm

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రం భారీ న‌ష్టాల దిశ‌గా ప‌య‌నిస్తోందా..? భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీగానే న‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ట‌. రూ.350కోట్ల ఖ‌ర్చుతో రిచ్‌గా తీసిని టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు మ‌రో రెండు భాష‌ల్లో రూపొందిన‌ప్ప‌టికి వ‌సూళ్ళు చూస్తే నిర్మాత‌ల‌కు క‌ళ్ళు బైర్లు క‌మ్ముతున్నాయ‌ట‌. ఇప్ప‌టికే సినిమా విడుద‌ల అయిన వెంట‌నే డివైట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడువంద‌ల కోట్లు వ‌సూళ్ళు దాట‌డ‌మే గ‌గనం అనుకున్నారు…

అయితే అనూహ్యంగా హిందీలో వ‌చ్చిన డిమాండ్‌, టాప్ హీరోల చిత్రాలు బ‌రిలో లేక‌పోవ‌డం సాహోకు క‌లిసొచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. అందుకే ఈసినిమా హిందీ బెల్ట్‌తో నిర్మాత‌ల‌ను ఒడ్డున ప‌డేస్తుండ‌గా, ఇక త‌మిళం, మ‌ళ‌యాళం, తెలుగులో మాత్రం నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవ‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. సాహో సినిమాకు నాలుగు రోజులు క‌లిసి వ‌చ్చాయి త‌ప్పితే ఇక ముందు సినిమా ముందుకు సాగ‌డం గ‌గ‌న‌మే అనేది చ‌ర్చ‌నీయాంశం అవుతుంది.

తెలుగులో సాహో సినిమా రూ.65కోట్ల‌ను రాబ‌ట్టింది. ఇంకా ఈసినిమా రూ.60కోట్లు సాధిస్తే త‌ప్ప నిర్మాత‌లు భ‌య్య‌ర్లు సేఫ్ అవుతారు. ఎందుకంటే ఈసినిమాను బ‌య్య‌ర్లు రూ.125కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఈలెక్క‌న ఈసినిమా మ‌హా అయితే మ‌రో ఇర‌వై ముప్పై కోట్లు వ‌సూలు చేస్తుండ వ‌చ్చు గాక‌. ఇక ఓవ‌ర్సీస్‌లోనూ సినిమా న‌ష్టాల బాటే ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికి సినిమా ఆరు మిలియ‌న్లు వ‌సూలు చేయాల్సి ఉండ‌గా, కేవ‌లం నాలుగు మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఇంకా రెండు మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయాలంటే త‌ల‌కు మించిన భార‌మే. సాహో సినిమాను కాపాడుతుంది మాత్రం కేవ‌లం హిందీ మార్కెట్‌. ఇప్ప‌టికే రూ.95కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమా మ‌రికొన్ని రోజుల్లో వంద మార్క్ ను ఈజీగా దాట‌గ‌లుగుతుంది. ఏదేమైనా సాహో సినిమాతో బ‌య్య‌ర్లు, నిర్మాత‌లు నిండా మున‌గ‌డం ఖాయం.

భారీ న‌ష్టాల దిశ‌గా సాహో ప‌య‌నం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts