హైప్ సాహోకు ఎలా లాభించిందంటే..?

September 4, 2019 at 5:30 pm

సాహో చిత్రానికి సినిమా టీమ్ విపరీతమైన హైప్ ఇచ్చారు. ప్రభాస్ చేస్తున్న బాహుబలిని మించిన చిత్రం.. హాలీవుడ్‌ను తలదన్నే యాక్షన్ సన్నివేశాలుంటాయి.. అంటూ చాలా ప్రాపగాండా జరిగింది. ప్రజలందరూ కూడా అంతే హై ఎక్స్‌పెక్టేషన్స్ తో ఎదురుచూశారు. అయితే ప్రేక్షకులు ఎక్కువ ఆశించారని… అందువల్లనే నిరాశపడ్డారని… చిత్ర దర్శకుడు సుజీత్ చాలా సింపుల్ గా తేల్చేశాడు. ఎక్కువగా ఆశించొద్దు.. అని ముందుగా ఒకమాట ఎందుకు చెప్పలేదో మనం ఊహించవచ్చు.

కానీ.. అంత భారీగా ఈ చిత్రానికి హైప్ సృష్టించడం వల్ల వారికి గొప్ప లాభమే వచ్చి పడింది. కేవలం హైప్ కారణంగానే.. సాహో చిత్రం ఇవాళ కలెక్షన్ల పరంగా సేఫ్ పొజిషన్లో ఉంది. చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా.. కలెక్షన్ల పరంగా.. మరీ దారుణంగా నష్టపోయే స్థితిలో నిర్మాతలు లేరు. ఎడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారు రెండో రోజుకే చాలా క్యాన్సిలేషన్లు చేసుకున్నా కూడా.. కలెక్షన్లు నిలకడగానే ఉన్నాయి. ఇంత బ్యాడ్ టాక్ వచ్చినా కూడా.. .ఇంత నిలకడ కలెక్షన్లు రాబట్టడం మరో చిత్రానికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు. కానీ సాహోకు కూడా అలాంటి ఫీట్ కేవలం హైప్ ద్వారా మాత్రమే సాధ్యం అయింది.

ఇంతకూ హైప్ ఎలా లాభించిందంటే.. .సాహో చిత్రం రికార్డులు అన్నీ బద్ధలు కొట్టేస్తుందనే భయంతో.. దీనికి పోటీగా ఆ శుక్రవారం నాటికి ఏ ఇతర చిత్రాలూ రిలీజ్ ప్లాన్ చేసుకోలేదు. దాదాపుగా ఆ శుక్రవారం నాడు ఒకే ఒక్క సాహో విడుదలైంది. శుక్రవారం ఓపెనింగ్ డే గనుక.. ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలకు కలెక్షన్ల సమస్య తెలియదు. ఆ వెంటనే వీకెండ్ రెండు రోజులూ కూడా ఇబ్బంది తెలియలేదు. లక్కీగా సోమవారం నాడు వినాయకచవితి పండగ వచ్చింది. ఆరకంగా దేశమంతా హాలిడే కావడం ఒక లాభం.

ఇన్ని ఎడ్వాంటేజీలకు తోడు.. హైప్ పుణ్యమాని.. మరే ఇతర చిత్రాలూ పోటీలో లేకపోవడం. వరుసగా సెలవులు కలిసివచ్చినప్పుడు … సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు సాహో తప్ప మరో గత్యంతరంలేని పరిస్థితి ఏర్పడింది. ఆ ఎపెక్ట్ కలెక్షన్లు మాత్రం స్థిరంగానే ఉండిపోయాయి. సినిమా డిజాస్టర్ టాక్ తోనే రన్ అవుతోంది.

హైప్ సాహోకు ఎలా లాభించిందంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts