సాహో సాగిల ప‌డుతోంది ఇక్క‌డే…!!

September 5, 2019 at 4:14 pm

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం సాహో.. ఈ సినిమా కొన్ని చోట్ల వీర‌లెవ‌ల్లో బాక్సాఫీసు వ‌ద్ద భారీగా వ‌సూళ్ళు రాబ‌డుతుండ‌గా కొన్ని చోట్ల అత్తెస‌రుగా సాగిల ప‌డుతూ ముందుకు సాగుతుంది. ఇంత‌లా సాగిల‌ప‌డుతున్నది ఎక్క‌డో తెలుసా… రికార్డు స్థాయిలో కనివిని ఎరుగ‌ని తీరులో అనేక థియోట‌ర్ల‌లో విడుద‌ల అయిన త‌మిళ‌నాడులో..

సాహో సినిమా తెలుగులో నైజాం ఏరియాలో, హిందీ బెల్ట్‌లో భారీ వ‌సూళ్ళు సాధిస్తూ బాక్సాఫీసు వ‌ద్ద దూసుకుపోతుంది. అయితే త‌మిళంలో హిట్ కొడుతుంద‌ని అనుకున్న ఈసినిమా మాత్రం బొక్కాబోర్లా ప‌డ్డ‌ద‌ట‌. ఇక్క‌డ డివైడ్ టాక్ రావ‌డంతో ఇప్ప‌టికే సినిమా తిరోగ‌మం దిశ‌గా ప‌య‌నిస్తుంద‌ట‌. వాస్త‌వానికి త‌మిళ‌నాడులో బాహుబ‌లి మ్యాజిక్‌ను సాహోను రిపీట్ చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌. హిందీ మార్కెట్‌లో వ‌స్తున్న క్రేజ్ త‌మిళ‌నాడులో రాలేక‌పోతుంద‌ట‌.

త‌మిళ‌నాడులో సాహో ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే చేసింది. ఇప్పుడు ఆ బిజినెస్‌ను రీచ్ కాలేక పోతుంద‌ట‌నే టాక్ వినిపిస్తుంది. తమిళ ప్ర‌జ‌లు సాహోను ఆద‌రించ‌లేక పోతున్నార‌ట‌. ఇక్క‌డ క‌నీసం అర‌వై శాతం న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని టాక్ వినిపిస్తుంద‌ట‌. అంటే త‌మిళ‌నాట సాహో సినిమా అట్ట‌ర్ ప్లాప్‌గా మిగిలిపోతుండ‌గా, కేర‌ళ లోనూ ఇదే ప‌రిస్థితి ఉంద‌ట‌. సో సాహో సినిమా త‌మిళం, మ‌ళ‌యాళంలో భారీ డిజాస్ట‌ర్‌గానే మిగిలిపోనున్న‌ద‌ట‌.

సాహో సాగిల ప‌డుతోంది ఇక్క‌డే…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts