సాహో ఎఫెక్ట్‌ రాజ‌మౌళి పుణ్య‌మేన‌ట‌…!

September 11, 2019 at 10:44 am

అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కేరీర్‌లో అత్యంత డిజాస్ట‌ర్ సినిమా కూడా సాహోనే. బాక్సాఫీసుల వ‌ద్ద ఎంత భారీగా వ‌సూళ్ళు రాబడుతున్నా సినిమా మాత్రం భారీ డిజాస్ట‌ర్‌గానే మిగిలిపోవ‌డం ఇది ఒక పీడ‌క‌లగానే భావించాలి. అయితే ఈ సినిమా ఫ్లాప్‌కు కార‌ణం అంతా పాపం యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ మీద నెట్టేసి అంతా చేతులు దులుపుకున్నారు.. అస‌లు ఈసినిమా ఫ్లాప్‌కు కార‌ణం ఇప్పుడు అంతా సుజిత్‌ను కాకుండా రాజ‌మౌళి వ‌ల్లే అనే స‌త్యం ఇప్పుడు అంద‌రికి బోధ‌ప‌డింద‌ట‌.

సాహో సినిమా విడుద‌ల కాక‌ముందు అంతా ఆహో… అని పొగిడిన సిని ప్ర‌పంచం సినిమా విడుద‌ల త‌రువాత సినిమా డిజాస్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు సుజిత్‌ను కార‌ణం చేసి గ‌మ్మున ఊరుకున్నారు.. అయితే ఇప్పుడు స‌డ‌న్‌గా సాహో సినిమా ఫ్లాప్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సెంటిమెంట్ కార‌ణం అట‌. ఎందుకంటే రాజ‌మౌళితో హిట్ కొట్టిన సినిమా త‌రువాత మ‌రే సినిమా హిట్ కాద‌ట‌. రాజ‌మౌళికి మాత్రం తాను తీసే సినిమాలు హిట్ అవుతాయ‌ట కానీ, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన హీరోల‌కు వ‌రుస‌గా రెండు సినిమాలు ఫ్లాప్‌లో చేరిపోతాయ‌ట‌.

అందుకు కార‌ణం లేక‌పోలేదట‌.. రాజ‌మౌళిది ఐర‌న్‌హండ్‌గా ఇప్పుడు అభివ‌ర్ణిస్తున్నారు. రాజ‌మౌళితో సినిమాలు చేసిన హీరోలంతా త‌రువాత చేసిన సినిమాలు భారీ ప్లాప్‌లు అవుతున్నాయి. అందుకు నిద‌ర్శ‌నంగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నానీ, సునిల్‌, నితిన్ వంటి హీరోలు చేసిన సినిమాలే. అయితే ఇక్క‌డ ఈ హీరోలంతా విజ‌యాల బాట ప‌ట్టాలంటే మ‌ళ్ళీ రాజ‌మౌళీతో సినిమా చేసిన త‌రువాతే అంటే ఆశ్చ‌ర్యం క‌లుగుక‌మాన‌దు. వాస్త‌వానికి బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ చేసిన సినిమా సాహో.. అందుకే రాజ‌మౌళీ హాండ్ మ‌హిమే అంటున్నారు నెటిజ‌న్లు..

సాహో ఎఫెక్ట్‌ రాజ‌మౌళి పుణ్య‌మేన‌ట‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts