సాహో తప్పు సైరా చేయ‌ల్లేదా..!

September 17, 2019 at 12:00 pm

పాన్ ఇండియా తెర‌కెక్కిన చిత్రం సాహో.. ఈ సినిమా బాలీవుడ్‌లో బాక్సాఫీసు వ‌ద్ద భారీ వ‌సూళ్ళ‌ను చేసినప్ప‌టికి ద‌క్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న మేర‌కు బాక్సాఫీసును మెప్పించ‌లేక‌పోయారు. సాహో సినిమా ను ద‌క్షిణాది భాష‌ల్లోనూ భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు నిర్వ‌హించినా కూడా అనుకున్న మేర‌కు విజ‌యం సాధించ‌లేక‌పోయింది. దీంతో సాహో సినిమా ద‌క్షిణాదిలో చావు దెబ్బ తిన్న‌ది.

అయితే సాహో చేసిన ఈ త‌ప్పులను సైరా సినిమా యూనిట్ చేయ‌వ‌ద్ద‌ని అనుకున్న‌ట్లు ఉంది. అందుకే ఇప్పుడు సైరా చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ విష‌యంలో వెనుక‌ప‌ట్టు ప‌ట్టింద‌నే టాక్ వినిపిస్తుంది. సైరా సినిమా తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం, హింది, క‌న్న‌డ భాష‌ల్లోనూ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి ద‌క్షిణ భార‌తంలో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అభిమానులే ఉన్నారు. అందుకే ద‌క్షిణాది భాష‌ల్లో సైరా చిత్రానికి ఎలాంటి ప్ర‌మోషన్ కార్య‌క్ర‌మం ఇంకా మొద‌లు పెట్ట‌లేదు.

అయితే ముంబాయ్‌లో ఇప్ప‌టికే సైరా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేశారు. అక్క‌డ ప్రెస్‌మీట్ కూడా చిరంజీవి నిర్వ‌హించారు. బాలీవుడ్‌లో మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఉండ‌టం ఈ సినిమాకు క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. ఇక ఇత‌ర భాష‌ల్లోనూ అనేక మంది ఆయా భాష‌ల ప్ర‌ముఖ న‌టులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. అందుకే సినిమా ప్ర‌మోష‌న్ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా, కేవ‌లం బాలీవుడ్‌, టాలీవుడ్ లోనే ప్ర‌మోష‌న్‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. దీనికి తోడు టీజ‌ర్‌, ఫ్రీ రిలీజ్ వేడుక‌లు జ‌రిగిన త‌రువాత ఒక‌సారి మెగాస్టార్ ప్రెస్‌మీట్లు పెట్టి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తార‌నే టాక్ కూడా ఉంది. సో సాహో సినిమా యూనిట్ చేసిన తొంద‌ర‌పాటు సైరా చేయ‌కూడద‌నే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు ఉన్నారు.

సాహో తప్పు సైరా చేయ‌ల్లేదా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts