మెగా హీరో ల‌వ్‌స్టోరీనే సినిమాగా…!

September 9, 2019 at 11:42 am

హీరోలు సాధార‌ణంగా ఓ సిని కుటుంబం వార‌స‌త్వంగా రావ‌డం అన‌వాయితీగా మారింది. అయితే ఇప్పుడు మెగా కుటుంబం నుంచి వార‌స‌త్వంగా సినిరంగ ప్ర‌వేశం చేశాడు మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. అయితే సిని కుటుంబాల నుంచి వ‌చ్చిన హీరోల‌కు సిని రంగ ప్ర‌వేశం చేయ‌కముందే కాలేజీలో ఓ ప్రేమ‌క‌థ సాగించాడ‌ట‌. అయితే ఈ ప్రేమ‌క‌థ బ్రేక‌ప్ కావ‌డంతో ఇప్పుడు అదే ప్రేమ‌క‌థ‌ను సినిమా క‌థ‌గా చేసి తానే హీరోగా న‌టించ‌నున్న‌ట్లు ఇప్పుడు ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ‌జోరుగా సాగుతుంది.

సాయిధ‌ర‌మ్‌తేజ్ తాను కాలేజ్‌లో చ‌దువుకుంటున్న‌ప్పుడు ఓ ప్రెండ్ ఉండేద‌ట‌. ఆమేతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయాడు.. అయితే సాయి ధ‌ర‌మ్ తేజ్ జీవితంలో ఎలాంటి సెటిల్‌మెంట్ లేక‌పోవ‌డంతో ఆ అమ్మాయి కాస్తా వేరే వ్య‌క్తిని పెండ్లి చేసుకుని వెళ్ళిపోయింద‌ట‌. దీంతో భ‌గ్న‌ప్రేమికుడిగా మారిపోయాడ‌ట సాయి ధ‌ర‌మ్ తేజ్‌. ఈ ప్రేమ‌క‌థ త‌రువాత తాను హీరో కావ‌డం జ‌రిగిపోయింద‌ట‌.

ఇప్పుడు మెగా హీరోగా సిని రంగంలో రాణిస్తూ త‌న‌కుంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న ప్రేమ‌క‌థ‌నే ఎందుకు సినిమాగా తీయ‌కూడ‌దు.. అదే క‌థ‌తో ఎందుకు సినిమా చేయ‌కూడ‌దు అనుకున్నాడ‌ట‌. అందుకే త‌న ప్రేమ‌క‌థ‌నే సినిమా క‌థ‌గా మార్చి సినిమాగా తీసి, తానే హీరోగా న‌టించాల‌నే కోరిక‌తో ఉన్నాడ‌ట సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఎంతోమంది హీరోలు త‌మ సొంత మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌ను, జీవిత సంఘ‌ట‌ల‌ను సినిమాలుగా చేసి ఉంటారు.. కాకుంటే వారు చెప్పుకోలేదు.. సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్పుకుంటున్నాడు అంతే తేడా… సో సాయి ప్రేమ‌క‌థ సినిమా కోసం ఎదురు చూద్దాం..

మెగా హీరో ల‌వ్‌స్టోరీనే సినిమాగా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts