మృత్యువుతో పోరాడుతున్న టీడీపీ మాజీ ఎంపీ, న‌టుడు శివ‌ప్ర‌సాద్…!

September 20, 2019 at 3:59 pm

తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నేతను కోల్పోయింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రముఖ సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ మృత్యువుతో పోరాడుతున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్‌ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . ఆయనకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

అయన వయసు 68 సంవత్సరాలు. 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించిన శివప్రసాద్‌ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి శివప్రసాద్ రెండుసార్లు టీడీపీ తరపున గెలుపొందారు. ఏపీ విభ‌జ‌న జ‌రిగే సంద‌ర్భంలోనూ కేంద్ర ప్ర‌భుత్వంపై వివిధ రూపాల్లో నిరస‌న తెలిపిన శివ‌ప్ర‌సాద్‌, ప్రత్యేక హోదా ఉద్యమాల సమయంలో రోజుకొక వేషం వేస్తూ ఆయన పార్లమెంట్ లో సందడి చేసేవారు.

అయితే ఓవైపు రాజ‌కీయాల్లో క్రియాశీల‌క పాత్ర పోషిస్తూనే మ‌రోవైపు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించి అల‌రించేవారు. అనేక సినిమాల్లో మాస్ క్యారెక్ట‌ర్ చేస్తూనే క‌మెడితో ప్రేక్ష‌కుల‌ను క‌డుబ్బ న‌వ్వించేవారు. రాజ‌కీయ నేత‌గా ఎదిగినా ఏనాడు సినిమాల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. మంచి సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తే వాటిని త‌న‌దైన శైలీలో హాస్యంతో కూడిన విల‌నిజం పండించేవారు. ఏదేమైనా శివ‌ప్ర‌సాద్ అనారోగ్యంతో అటు రాజ‌కీయాల‌కు, ఇటు సిని రంగానికి తీర‌ని లోట‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.

మృత్యువుతో పోరాడుతున్న టీడీపీ మాజీ ఎంపీ, న‌టుడు శివ‌ప్ర‌సాద్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts