సైరాకు బాలీవుడ్ షాక్‌..!

September 21, 2019 at 5:43 pm

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌లు న‌టిస్తున్న ఈ సైరా చిత్రం అక్టోబ‌ర్ 2న విడుదల కానున్న నేప‌థ్యంలో ఇప్పుడు బాలీవుడ్ లో భారీ షాక్ త‌గిలింది. టాలీవుడ్ మెగాస్టార్‌కు బాలీవుడ్‌లో ఎర్ర‌తివాచి ప‌ర‌చ‌డం మాట అంటుంచితే.. క‌నీసం గౌర‌వ మ‌ర్యాద‌లు ద‌క్క‌కుండా చేయాల‌ని కొంద‌రు బాలీవుడ్ పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తూ సైరాను దెబ్బ కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారట‌..

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఈ సైరా చిత్రం ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి జీవ‌త క‌థ ఆధారంగా తెర‌కెక్కుతుంది. మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ నిర్మాత‌గా సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రోడ‌క్ష‌న్ కంపెనీ నుంచి నిర్మిస్తున్నారు. అయితే ఇటీవ‌లే సైరా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైల‌ర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌స్తుండ‌టం, దానికి వ‌స్తున్న స్పంద‌న‌తో బాలీవుడ్ పెద్ద‌ల‌కు కంట‌గింపుగా మారింద‌నే టాక్ వ‌స్తుంది.

సైరా ట్రైల‌ర్‌తో బాలీవుడ్‌లో కూడా భారీ స్పంద‌న వ‌స్తున్న నేప‌థ్యంలో పాన్ ఇండియా చిత్రాల‌కు బాలీవుడ్‌లో స్థానం లేకుండా చేయాల‌నే త‌లంపుతో ఇప్పుడు బాలీవుడ్ న‌టులు, పెద్ద‌లు కొంద‌రు బాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం వార్‌కు సపోర్టు చేస్తున్నార‌ట‌. అందుకు నిద‌ర్శ‌నంగా బాలీవుడ్‌లో పెద్ద‌మొత్తంలో థియోట‌ర్ల‌ను వార్ సినిమాకు కెటాయించి, సైరాకు థియోట‌ర్ల‌ను త‌క్కువ‌గా కెటాయించిన‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే సాహో చిత్రం పాన్ ఇండియా సినిమాగా అత్య‌ధిక థియోట‌ర్ల‌లో విడుద‌ల కావ‌డం, భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టిన నేప‌థ్యంలో సైరా చిత్రానికి త‌క్కువ థియోట‌ర్ల‌ను కెటాయించాల‌ని బాలీవుడ్‌లో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయిట‌. వార్ సినిమా, సైరా ఒకే రోజున విడుద‌ల అవుతున్న‌నేప‌థ్యంతో రెండు సినిమా న‌డుమ వార్ న‌డుస్తుంది. దీంతో సైరా సినిమాకు మొద‌టి దెబ్బ త‌గిలిన‌ట్లే…

సైరాకు బాలీవుడ్ షాక్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts