సైరా క్లైమాక్స్‌లో భారీ కోత‌..!

September 17, 2019 at 11:20 am

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టిస్తున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. అత్యంత భారీ బ‌డ్జెట్ రూ.250కోట్ల‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం త్వ‌ర‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానున్న‌ది. సినిమాను ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించగా, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ నిర్మాత‌గా, త‌న సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రోడ‌క్ష‌న్ కంపెనీ నుంచి నిర్మిస్తున్నారు. గ‌త రెండేండ్లుగా నిర్మిత‌మ‌వుతున్న చిత్రం సైరా.

అయితే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను దాదాపు పూర్తి చేసుకుంటుంది. అయితే సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సైరాకు సంబంధించిన ఓ పుకారు టాలీవుడ్‌లో షికారు చేస్తుంది. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి సినిమాను క్లైమాక్స్ లో భారీగా తెర‌కెక్కించాడ‌ట‌. అయితే వీటిని భారీగా కోత పెట్టె ప‌నిలో ద‌ర్శ‌కుడు కృషి చేస్తున్నాడ‌ట‌.

సైరా చిత్రంలో న‌ర‌సింహారెడ్డి నిజ జీవిత సంఘ‌ట‌న‌లు అనేకం య‌ధాత‌థంగా తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. అయితే సైరా చిత్రంలో మాత్రం నిజ‌జీవిత సంఘ‌ట‌ల‌ను అలాగే తీస్తే సినిమా నిడివి భారీగా పెరుగుతుంద‌ట‌. దీనికి తోడు క్లైమాక్స్‌లో అతి భ‌యంక‌ర సంఘ‌ట‌న‌ల‌ను తెర‌కెక్కించార‌ట‌. ఈ భ‌యంక‌ర‌మైన క్లైమాక్స్ తో ఒళ్ళు గ‌గుర్పొడిచేలా ఉండ‌టంతో వాటిలో చాలా వాటికి కోత పెట్టెందుకు సిద్ద‌మైయ్యార‌ట ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి. సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అభిమానులు ఎక్క‌డ డిసాప్పియింగ్ కాకుండా అత్యంత జాగ్ర‌త్త‌గా కోత విధిస్తున్నార‌ట‌…

సైరా క్లైమాక్స్‌లో భారీ కోత‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts