సైరా ఎందుకు తేడా కొడుతోంది…!

September 17, 2019 at 11:03 am

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఈ సినిమా థియేటర్ లోకి వచ్చేందుకు గట్టిగా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది. తెలుగు వరకు సైరా ప‌బ్లిసిటీ జరుగుతున్నా… నాన్‌ తెలుగు ఏరియాల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఓ వైపు చూస్తే రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ సినిమా అంటూ హడావుడి చేస్తున్నారు. ఇండియా రేంజ్‌లో పాన్ ఇండియా సినిమాలుగా తెలుగులో విడుదలైన సినిమాలు బాహుబలి సీరిస్‌ సినిమాలతో పాటు సాహో ఉన్నాయి.

వాటితో చూస్తే సైరా ఏ మాత్రం తీసిపోదు. రిలీజ్ డేట్‌ దగ్గరపడుతున్నా ఇత‌ర భాష‌ల్లో పబ్లిసిటీ చూస్తుంటే ఏమాత్రం పట్టించుకున్న‌ట్టు కనిపించడం లేదు. హిందీ ఏరియాలో గ‌ట్టి పోటీ ఉంది. సైరా సినిమా కు పోటీగా వార్‌ లాంటి భారీ అంచనాలు ఉన్న సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పబ్లిసిటీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ముంబై లోను… ఇటు చెన్నైతో పాటు బెంగళూరు… కేరళలో కూడా ప్రమోషన్లు చేయాలి. చిరంజీవి వయస్సు రీత్యా ఇంత తక్కువ టైంలో ఇవన్నీ చేస్తారా ? అన్న సందేహం కూడా ఉంది.

తెలుగులో కూడా సైరా సినిమా రేంజ్ చూసి మీడియా స్వయంగా ఇస్తున్న క‌వ‌రేజ్‌ తప్ప తెలుగు మీడియాను కూడా సైరా యూనిట్ పట్టించుకోవడం లేదు. మీడియా విషయంలో భారీ బడ్జెట్ సినిమాలు వ‌స్తున్న‌ప్పుడు మేక‌ర్స్ లైట్ తీస్కొంటున్నారు. ఇక్క‌డే కొన్ని తప్పులు జరుగుతున్నాయి. సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే…. తేడా వస్తే మాత్రం మీడియాలో నెగిటివ్‌ వార్తలు రాకుండా అప్పుడు మీడియా వెంట పడుతూ ఉంటారు.

సాహో విషయంలో కాస్త ముందుగానే ఇతర భాషల్లో భారీ ఎత్తున ప్రమోషన్లు చేశారు. తెలుగులో రిలీజ్‌కు మూడురోజుల ముందు నుంచి ప్రమోషన్లు చేశారు. సినిమాకు టాక్‌ తేడాగా రావడంతో తెలుగు మీడియా సైతం సాహోను ఆడేసుకుంది. ఇక నుంచి అయినా సైరాకు మిగిలిన భాష‌ల్లో ప్ర‌మోష‌న్లు స్టార్ట్ చేస్తే మంచి ఓపెనింగ్స్‌, హైప్ వ‌స్తుంది. లేక‌పోతే దెబ్బ ప‌డ‌క త‌ప్ప‌దు.

సైరా ఎందుకు తేడా కొడుతోంది…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts