‘ సైరా ‘ టిక్కెట్ల రేట్లు… అప్పుడే బాదుడు స్టార్ట్‌

September 18, 2019 at 1:22 pm

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప్రెస్టేజియ‌స్ మూవీ సైరా హంగామా స్టార్ట్ అయ్యింది. బుధ‌వారం సాయంత్రం సైరా ట్రైల‌ర్ రిలీజ్‌తోనే సైరా ఏ రేంజ్ సినిమాగా ఉంటుంద‌నేది క్లారిటీ వ‌చ్చేయ‌నుంది. తెలుగును ప‌క్క‌న పెడితే ఇటు దక్షిణాది రాష్ట్రాలను మించి అటు ఉత్తరాదిన అత్యంత క్రేజీగా రిలీజ్ చేసేందుకు అనిల్ త‌డానీతో కలిసి ఫర్హాన్ అక్తర్ ఏర్పాట్లు చేస్తున్నారట. అలాగే ఓవర్సీస్ లో అత్యంత కీలకమైన ఉత్తర అమెరికాలో అంతే భారీగా సైరాను రిలీజ్ చేయనున్నారు.

ఇక సైరా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక సినిమాకు మ‌రింత హైప్ వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల తెలుగులో పెద్ద సినిమాలు వ‌స్తుంటే టిక్కెట్ల రేట్ల‌ను ఇష్టానుసారం పెంచేస్తున్నారు. దీని వ‌ల్ల స‌గ‌టు సినిమా అభిమాని తొలి రోజు సినిమా చూడాలంటే సాధ్యం కావ‌డం లేదు. ఇటీవలే సాహో టిక్కెట్టు ధరల్ని అమాంతం పెంచి అమ్ముకున్నారు. కొన్నిచోట్ల అనుమతులు లేకపోయినా రేట్లు పెంచారని గడబిడ నడిచింది.

తెలంగాణ‌లో టిక్కెట్ల రేట్లు పెంచ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా వార్నింగ్ ఇవ్వ‌డంతో అంద‌రికి ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చిరంజీవి క్రేజ్‌ను వాడుకుని.. సినిమా బ‌డ్జెట్ నేప‌థ్యంలో టిక్కెట్ల రేట్లు పెంచేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు విన‌తులు వెళుతున్న‌ట్టు తెలుస్తోంది. చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌తోనూ సాన్నిహిత్యం ఉంది.

మ‌రి ఇత‌ర హీరోల సినిమాల‌కు టిక్కెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి ఇవ్వ‌ని వీరు చిరుకు ఎంత స‌న్నిహిత‌మైనా.. ఎంత సీనియ‌ర్ హీరో అయినా మిన‌హాయింపు ఇస్తారా ? అన్న‌ది చూడాలి. ఇక అమెరికాలో సైరా అమెరికాలోనూ అత్యంత భారీగా రిలీజవుతోంది. అక్కడ ఇప్పటికే టిక్కెట్ల ధరల్ని ఫిక్స్ చేశారట. ఒక్కో టిక్కెట్టుకి పెద్దలకు 28 డాలర్లు.. పిల్లలకు 18 డాలర్లు ఫిక్స్ చేశారు.

ఇక వీక్ డేస్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఆఫ‌ర్లు కూడా ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం ఒక టిక్కెట్ కొంటే ఇంకో టిక్కెట్టు ఉచితం అంటూ ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ పెద్ద ప్లస్ అవుతుందని పంపిణీదారులు భావిస్తున్నారు.

‘ సైరా ‘ టిక్కెట్ల రేట్లు… అప్పుడే బాదుడు స్టార్ట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts