రికార్డు ధ‌ర‌కు సైరా డిజిట‌ల్ రైట్స్‌…!!

September 10, 2019 at 5:39 pm

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండ‌గా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
బ్యానర్ పై మెగాస్టార్ త‌న‌యుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమా అక్టోబ‌ర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న‌ది. ఈ సినిమాపై ఇప్ప‌టికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సైరా సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రూ.40 కోట్ల రికార్డ్ ధరకు హక్కులను అమెజాన్ ప్రైమ్ ఇండియా సొంతం చేసుకుందని ఫిలింన‌గ‌ర్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మిత‌మైంది. అందుకే ఈ సినిమాను అన్ని భాషలకు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది.

అయితే ఈసినిమా సుమారు రూ.250కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న త‌రుణంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా భారీగానే చేస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రాన్ని ఏరియాల వారిగా అమ్మ‌కాలు జ‌రుప‌గా భారీ బ‌డ్జెట్ తోనే బ‌య్య‌ర్లు కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల కాగా, నైజాంలో అత్యధికంగా సైరా రూ.30కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో మెగాస్టార్ స్టామినాతో రూ.22 కోట్లకు, ఉత్త‌రాంధ్రలో రూ.14.4 కోట్లకు, తూర్పు గోదావరి – కృష్ణ లో 17కోట్లకు, గుంటూరులో రూ.11.5కోట్లు, నెల్లూరులో రూ.4.8కోట్ల సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయ‌ని తెలుస్తోంది.

రికార్డు ధ‌ర‌కు సైరా డిజిట‌ల్ రైట్స్‌…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts