సైరా చివ‌రి కోరిక ఏంటో తెలుసా..!

September 11, 2019 at 11:40 am

తెల్ల‌దొర‌ల‌పై స్వ‌యం పాల‌న కోసం జ‌రిగిన పోరాటంలో అస్త‌మించిన‌ రేనాటి సూర్యుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి.. అయ‌న జీవిత క‌థ‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. సైరా పేరుతో వ‌స్తున్న ఈచిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ నిర్మాత‌గా త‌న సొంత నిర్మాణ‌సంస్థ కొణిదెల ప్రోడ‌క్ష‌న్ కంపెనీ నుంచి తెర‌కెక్కిస్తున్నాడు.

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సైరా చిత్రం అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటున్న ద‌శ‌లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా విజ‌య‌వంతంగా సాగిస్తున్న‌ది. అయితే ఇప్పుడు ఈసినిమాపై సిని ప‌రిశ్ర‌మ‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సైరా చిత్ర పాత్ర‌దారి బ్రిటీష్ పాల‌కుల చేతిలో చ‌నిపోయే సీన్ ఉంద‌ట‌. అందులో బ్రిటీష్ పాల‌కులు న‌ర‌సింహారెడ్డిని చంపేముందు నీ ఆఖరి కోరిక కోరుకో.. అది ఒక్క సెంటెన్స్ లో చెప్పు అని అడుగుతారట.
ఫ.. ఆఫ్ ఫ్రమ్ మై కంట్రీ అంటూ డైలాగ్ ను ముగిస్తాడ‌ట‌.. ఇప్పుడు ఈ టాక్ సిని ప‌రిశ్ర‌మ‌లో బాగా వైర‌ల్ అవుతుంది. ఇంత‌టి పవర్ ఫుల్ డైలాగ్ మెగాస్టార్ ఎంత‌టి భారీగా చెప్పిఉంటాడో అనే ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి.

సైరా చివ‌రి కోరిక ఏంటో తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts