సైరా ట్రైల‌ర్‌కు ముహూర్తం ఫిక్స్‌..!

September 12, 2019 at 3:52 pm

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి. కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబ‌ర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సైరా చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం సైరా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. తాజాగా చిత్రయూనిట్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాట్రైలర్‌ను ఈ నెల 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఓ స్వాతంత్య్ర‌ సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. చిత్రంలో ఇంకా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటుగా జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

సైరా ట్రైల‌ర్‌కు ముహూర్తం ఫిక్స్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts