‘ సైరా ‘ ట్రైల‌ర్ 24 గంట‌ల టార్గెట్లు ఇవే

September 18, 2019 at 12:59 pm

మోస్ట్ అవైటెడ్ `సైరా- నరసింహారెడ్డి` ఇరు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడులో అత్యంత భారీగా రిలీజవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ బుధ‌వారం నిర్వహించాల్సి ఉన్నా 22కు వాయిదా ప‌డింది. ఒక్క‌సారిగా ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్ అయ్యారు. వారిని నిరాశ‌ప‌ర‌చ‌కుండా బుధ‌వారం సాయంత్రం సైరా ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్నారు.

టాలీవుడ్ ట్రైలర్ రికార్డుల విషయం లో కూడా సరికొత్త రికార్డులను నమోదు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి నాన్ బాహుబలి రికార్డులు ప్రభాస్ నటించిన సాహో ట్రైలర్ పేరిట ఉన్నాయి. ఆ రికార్డులతో పాటు కుదిరితే బాహుబలి ట్రైలర్ రికార్డులను కూడా సవాల్ చేయాలనీ ఫ్యాన్స్ చూస్తున్నారు. కాగా టాలీవుడ్ హిస్టరీ లో ట్రైలర్స్ విషయం లో తొలి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్స్ ని గమనిస్తే…

బాహుబ‌లి 2 21.81 మిలియ‌న్ల‌తో టాప్ ప్లేసులో ఉంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సాహో 12.32 – మ‌హ‌ర్షి 7.31 –
అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ 7.8 – నానువ్వే 6.97 – విన‌య‌విధేయ రామ 6.57 – అజ్ఞాత‌వాసి 6.2 తొలి 24 గంట‌ల్లోనే హ‌య్య‌స్ట్ వ్యూస్ అందుకున్నాయి.

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్స్ చూస్తే…
బాహుబ‌లి 2 497 k లైక్స్ సొంతం చేసుకుంటే.. సాహో 392 k – అజ్ఞాత‌వాసి 272 k – విన‌య‌విధేయ రామ 238 k – డియ‌ర్ కామ్రేడ్ 233 k – మ‌హ‌ర్షి 197 k ఉన్నాయి.

మొత్తం మీద బాహుబలి & సాహో సైరా ట్రైలర్ టార్గెట్లు గా చెప్పుకోవాలి. మరి ఈ రికార్డులలో సైరా ట్రైలర్ ఏ రికార్డులను బ్రేక్ చేస్తుంది, 24 గంటల్లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ & ఎన్ని మిలియన్స్ లైక్స్ తో ఊచకోత కోస్తుందో తెలియాలంటే సైరా ట్రైల‌ర్‌కు వ‌చ్చిన టాక్‌ను బ‌ట్టే తెలుస్తుంది.

‘ సైరా ‘ ట్రైల‌ర్ 24 గంట‌ల టార్గెట్లు ఇవే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts