టీడీపీకి మాజీ మంత్రి త‌మ్ముడు గుడ్ బై..!

September 17, 2019 at 11:13 am

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన‌ మూడు నెలలకే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కీలకనేత సైతం త్వరలోనే టిడిపికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో బొబ్బిలి సంస్థానాధీశులు అయిన‌ మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తమ్ముడు బేబీ నాయ‌న‌ను బిజెపిలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో కేంద్ర నాయకత్వం సూచనల మేరకు బీజేపీ రాష్ట్ర అగ్ర‌నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

ఉత్తరాంధ్రలో బలమైన నేతల కోసం అన్వేషిస్తున్న బిజెపి రంగారావు కుటుంబంపై పెట్టినట్టు తెలుస్తోంది. మొదట మంత్రిగా పనిచేసిన సుజయ్ కృష్ణను సంప్రదించగా ఆయన అంత ఆసక్తితో లేకపోవడంతో టిడిపి తోనూ… అన్నతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న సుజ‌య్‌ తమ్ముడు, బొబ్బిలి చిన్న రాజుగా పేరున్న బేబీ నాయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే బేబీనాయనకు సుజయ్కృష్ణ కు గత కొద్ది రోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో అన్న కాకుండా తానే స్వ‌యంగా పోటీ చేయాల‌ని భావించారు.

అయితే అన్న సుజ‌య్ చివ‌ర్లో తానే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో బేబీనాయ‌న సైలెంట్ అయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో సుజ‌య్ విజ‌య‌న‌గ‌రం ఎంపీగా వైసీపీ త‌రపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత అన్న మంత్రిగా ఉన్న‌ప్పుడు కొద్ది రోజుల పాటు ఆయ‌న చ‌క్రం తిప్పినా… చివ‌ర‌కు బొబ్బిలి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌న్న కోరిక మ‌న‌సులో ఉంచుకున్నారు. అన్న త‌న కోరిక‌కు ఓకే చెప్ప‌క‌పోవ‌డంతో బేబీ నాయ‌న ఆశ‌లు నెర‌వేర‌లేదు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీడీపీకి భ‌విష్య‌త్ లేద‌ని డిసైడ్ అయిన బేబీనాయ‌న ఇప్పుడు కాకపోయినా రెండు మూడు నెలల్లోనైనా బీజేపీలో చేరడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజా ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలో చేరాలని బేబినాయన ప్రయత్నించినట్టు ప్రచారం జరిగింది.. కానీ కుదరకపోవడంతో టీడీపీలోనే ఉన్నారు.

టీడీపీకి మాజీ మంత్రి త‌మ్ముడు గుడ్ బై..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts