ఇంత జ‌రుగుతున్న ఆ టీడీపీ నేత‌ల మౌనం.. రీజ‌న్ ఇదేనా…?

September 9, 2019 at 12:04 pm

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ స‌హా మ‌రికొద్ది మాత్ర‌మే నిప్పు లు చెరుగుతున్నారు. జ‌గ‌న్ పాల‌న తుగ్ల‌క్‌ను త‌ల‌పిస్తోంద‌ని, ముద్దులు, ర‌ద్దుల ప్ర‌భుత్వంగా ఉంద‌ని వి మ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక‌, తాజాగా ప్ర‌భుత్వానికి 100 పూర్త‌యిన నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులు చార్జ్ షీ ట్ పేరుతో పెద్ద త‌ప్పుల జాబితాను విడుద‌ల చేశారు. మొత్తానికి వంద రోజుల్లో 125 త‌ప్పులు చేశారంటూ.. ఆయన‌ను ఏకేశారు. క‌ట్ చేస్తే. ప్ర‌తిప‌క్షం సాధార‌ణంగానే ఇలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌రిపాటి. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో క‌నిపిస్తున్న‌వారే క‌నిపిస్తున్నారు. వినిపిస్తున్న విమ‌ర్శ‌లే వినిపిస్తున్నాయి.

కానీ, చంద్ర‌బాబు పాల‌న‌లో కీల‌క‌మైన నాయ‌కులుగా ఓ వెలుగు వెలిగిన మంత్రులుగానీ, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమైపోయోరో.. అనే సందేహం వ‌చ్చేలా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఇలాంటి వారిలో గంటా శ్రీనివాస‌రావు, నారాయ‌ణ‌, అమ‌ర్‌నాథ్‌రెడ్డి, ప‌రిటాల సునీత‌, ఎంపీలు మాగంటి ముర‌ళీ మోహ‌న్‌, జేసీ దివాక‌ర్‌, అప్ప‌టి ఎమ్మెల్యేలు జీవీ ఆంజ‌నేయ‌లు, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, బొండా ఉమా, బీద మ‌స్తాన్ రావు, దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌, ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ వంటి వారు ఎక్క‌డా నోరు మెద‌ప‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో నూ ఎక్క‌డా వీరు క‌నిపించ‌డం లేదు. దీంతో అస‌లు వీరికి ఏమైంది? అనే సందేహం తెర‌మీదికి వ‌స్తోంది.

ప్ర‌స్తుతం వీరంతా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి భ‌య‌ప‌డుతున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌మ‌ను ఏమైనా చేస్తుందేమో..? కేసులు పెడుతుందేమో? అని వారంతా కూడా హ‌డ‌లి పోతున్నార‌ని అంటున్నారు. పైన చెప్పుకొన్న అంద‌రిపైనా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక‌రిద్ద‌రిపై లేక పోయినా.. గ‌తంలో ప్ర‌భుత్వ హ‌యాంలో వారు చేసిన ప‌నుల‌పై ఇప్పుడు తాజాగా అయినా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం మెండుగా ఉంది. దీంతో ఎందుకొచ్చిన పిత‌లాట‌కం అనుకుంటున్నార‌ని స‌మాచారం.

ఇక దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్, న‌రేంద్ర లాంటి నేత‌లు అయితే వైసీపీపై విమ‌ర్శ‌లు చేసేందుకే భ‌య‌ప‌డుతున్నారు. ఏ మాత్రం మాట్లాడినా తాము వైసీపీకి ఎక్క‌డ టార్గెట్ అవుతామో ? అన్న ఆందోళ‌నే వీరికి ఉంద‌న్నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఈ విష‌యం టీడీపీ వ‌ర్గాల్లోనే ట్రెండ్ అవుతోంది. నిజానికి ప్ర‌భుత్వం మారిన ప్ర‌తిసారీ.. కేసుల క‌థ మామూలే. అయితే, ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబు కూడా పోరాడే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో కింది స్థాయి నాయ‌కులు హ‌డ‌లి పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే వీరంతా కూడా మౌనంగా ఉన్నార‌ని స‌మాచారం.

ఇంత జ‌రుగుతున్న ఆ టీడీపీ నేత‌ల మౌనం.. రీజ‌న్ ఇదేనా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts