టీడీపీలో క‌ల‌క‌లం…రీజ‌నేంటి..?

September 26, 2019 at 10:35 am

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తున్నాన‌ని చెబుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పార్టీ ప‌రంగా చూసుకుంటే.. ఆశించిన మేర‌కు పార్టీ నేత‌ల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు విని పిస్తున్నాయి. చంద్ర‌బాబు ఎంత‌గా త‌న విశ్వ‌రూపం చూపించి, అధికార ప‌క్షంపై పోరు చేస్తున్నా.. తీవ్ర విమ‌ర్శ‌లు చేసి .. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నాన‌ని అంటున్నా.. పార్టీలో మాత్రం ఈ మేర‌కు భ‌రోసా మాత్రం ఇవ్వ‌లేక పోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా విజయం సాధించి పార్టీ ప‌గ్గాల‌తోపాటు త‌న కుమారుడికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాల‌నే క‌ల‌లు ఇప్ప‌ట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు.

టీడీపీ నుంచి ఇప్ప‌టికే కొంద‌రు సీనియ‌ర్లు, ఎంపీలుగా ప‌ద‌వులు పొందిన వారు లోపాయికారీగా పార్టీ మారి పోయిన విష‌యం తెలిసిందే. స‌రే.. వీరికి వ్యాపారాలు ఉన్నాయి. కాబ‌ట్టి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా వారిపై ఒత్తిడి పెరుగుతుంది కాబ‌ట్టి.. వారు పార్టీ మారిపోయార‌ని అనుకున్నా.. కొన్నాళ్లుగా వ‌రుస పెట్టి మ‌రికొంద‌రు నాయ‌కులు కూడా పార్టీ మారుతుండ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. నిజానికి ఈ వ‌ల‌స ల‌ను అడ్డుకునేందుకు చంద్ర‌బాబు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ఆయ‌న పార్టీ త‌ర‌ఫున వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఎదురైన చేదు అనుభ‌వం నుంచి పార్టీని, నాయకుల‌ను బ‌య‌ట‌పడేసేందుకు బాబు ప్ర‌య‌త్ని స్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏమీ ఫ‌లించ‌డం లేదు. నాయ‌కుల్లో ఎక్క‌డో అసంతృప్తి.. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ మారిన వారిలో కొంద‌రికి మాత్ర‌మే వ్యాపారాలు ఉండ‌గా.. గ‌డిచిన వారంలో పార్టీ మారిన తోట త్రిమూర్తులు కానీ, ఇప్పుడు బాబుకు బై చెప్ప‌నున్న పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు కానీ.. పెద్ద‌గా వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు, బ్యాంకుల‌తో లావాదేవీలు ఉన్న వారు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి ఇలాంటి వారు కూడా పార్టీ మారుతున్నారంటే.. చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారంటే.. పార్టీలో ఏదో లోపం క‌నిపిస్తోంది. భ‌విష్య‌త్తుపై ఏదో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌రకు తాను స్వ‌యంగా రంగంలోకి దిగితే.. ఏ స‌మ‌స్య అయినా ప‌రిష్కారం అవుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆయ‌న వ‌ల్ల కూడా అయ్యే ప‌రిస్థితి లేద‌ని తెలియ‌డం, మొత్తానికే చేతులు కాలిన చందంగా ప‌రిస్థితి మారిపోవ‌డం వంటివి పార్టీని మ‌రిన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

టీడీపీలో క‌ల‌క‌లం…రీజ‌నేంటి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts