టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ శివ ప్రసాద్ మృతి

September 21, 2019 at 2:47 pm

ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్ష టీడీపీకి మ‌రో భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచే కోలుకోలేక తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్న టీడీపీకి సీనియ‌ర్ నాయ‌కులు దూర‌మ‌వుతున్నారు. కొంద‌రుపార్టీలు మారిపోతుండ‌గా.. మ‌రికొంద‌రు హ‌ఠాన్మ‌ర‌ణం చెందుతున్నారు. నిన్న‌గాక మొన్న మాజీ స్పీక‌ర్ , ప‌ల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య చేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. దీంతో గుంటూరులో కీల‌క నాయ‌కుడి ని పోగొట్టుకున్న టీడీపీ తీవ్ర ఇబ్బందుల్లో ప‌డిపోయింది. దీని నుంచి ఇంకా కోలుకోక ముందుగానే టీడీపీకి మ‌రో భారీషాక్ త‌గిలింది.

చిత్తూరు జిల్లా చిత్తూరు పార్ల‌మెంటు స్థానం నుంచి 2014లో విజ‌యం సాధించిన శివ‌ప్ర‌సాద్ శుక్ర‌వారం హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న శివ‌ప్ర‌సాద్‌.. ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు. సుదీర్ఘ కాలంగా టీడీపీకి న‌మ్మిన‌బంటుగా ఉన్న ఎస్సీ వ‌ర్గానికి చెందిన శివ‌ప్ర‌సాద్‌.. సినిమా రంగంలోనూ రాణించారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.

క్యామెడీ ఆర్టిస్టుగా సినిమా రంగంలోకి ప్ర‌వేశించిన ఆయ‌న కోడి రామ‌కృష్ణ‌తో చ‌నువుగా ఉన్నారు. కోడి తీసిన అనేక చిత్రాల్లో ఆయ‌న న‌టించారు. దాస‌రి నారాయ‌ణ‌కు ప్రియ న‌టుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక‌, రాజ‌కీయాల్లో అన్న‌గారికి జై కొట్టిన శివ‌ప్ర‌సాద్‌.. సుదీర్ఘ కాలంగా టీడీపీతో అనుబంధం పెంచుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయ‌న రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా విజ‌యం సాదించారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం జ‌రిగిన ఉద్య‌మ స‌మ‌యంలో త‌న‌దైన శైలిలో ఆయ‌న దూసుకుపోయారు.

విభిన్న వేషాలు ధ‌రించి, పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎంత అవ‌స‌ర‌మో వివ‌రించారు. చంద్ర‌బాబు ఆదేశాల‌ను తూచ త‌ప్ప‌కుండా పాటించే నేత‌ల్లో ఆయ‌న కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడిగా త‌న అల్లుడుకి కూడా టికెట్ ఇప్పించుకున్నారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు మామా అల్లుళ్లు ఓట‌మి పాల‌య్యారు. శివ‌ప్ర‌సాద్ లేని లోటు టీడీపీకి ఎక్కువే అంటున్నారు ప‌రిశీల‌కులు.

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ శివ ప్రసాద్ మృతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts