టీడీపీ మాజీ మంత్రి బీజేపీలోకి కన్ఫర్మ్ !

September 7, 2019 at 12:40 pm

ఏపీలో టిడిపి చాలాచోట్ల ఖాళీ అయిపోతుంది. మిగిలిన జిల్లాల్లోనే టిడిపి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అంటే ఎక్కడ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆ పార్టీ పరిస్థితి ఎంత దిగజారిపోతోందో ఊహించలేం కూడా.. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నుంచి చంద్రబాబు కడప జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగుకు కీల‌క నేత‌ ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీ సీటు… మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ సీటు ఇచ్చారు. చంద్రబాబు జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు గా మారాయి ఇక్కడ టిడిపి అడ్రస్ గల్లంతు అయ్యే పరిస్థితి వచ్చేసింది.

జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు తో పాటు కడప ఎంపీ సీటుని సైతం వైసీపీ గెలుచుకుంది. ఇక కీలకమైన జమ్మలమడుగు కు చాలా ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా రాజకీయ శత్రువులుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలను చంద్రబాబు ఒకే తాటి మీదకు తీసుకువచ్చారు. ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ సుధీర్ రెడ్డి ఈ రెండు వర్గాలకు చెక్‌పెట్టి విజయం సాధించారు. ఇప్పుడు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో వైసిపి జమ్మలమడుగులో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఫలితంగా రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదే క్రమంలో ఆదినారాయణరెడ్డి టిడిపిలో కొనసాగలేనని బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క్లారిటీ కూడా ఇచ్చేశారు. ‘‘బీజేపీలో చేరడం ఖాయం. అనుచరులతో సమావేశమై తేదీ నిర్ణయించడమే మిగిలింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి చంద్రబాబును కలిసి మాట్లాడింది నిజమే. మా వాళ్లతో మాట్లాడి చెపుతానని ఆయనకు స్పష్టంగా చెప్పాను. పార్టీలో కొనసాగుతానని టీడీపీ వర్గాలు చెప్పడం సరికాదు’’ అని ఆది నారాయణరెడ్డి అన్నారు.

తనకు దేశభక్తి ఎక్కువనీ, తన ప్రాంతం అభివృద్ధి కోసమే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. క‌డ‌ప జిల్లాలో టీడీపీ అభ్య‌ర్థుల ఎంపిక స‌క్ర‌మంగా లేద‌ని కూడా ఆయ‌న విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే రామ‌సుబ్బారెడ్డి వైసీపీలో చేరి..ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతే జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీది గ‌త చ‌రిత్రే అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

టీడీపీ మాజీ మంత్రి బీజేపీలోకి కన్ఫర్మ్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts