తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందా..!

September 19, 2019 at 4:01 pm

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిపై పార్టీలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి.
నిన్న అసెంబ్లీ స‌మావేశాల విరామ స‌మ‌యంలో మీడియాతో కోమ‌టిరెడ్డి చేసిన కామెంట్లు దుమారం రే పుతున్నాయి. త‌న స్థాయికి మించి కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నా… ఇంకా ఎందుకు ఆయ‌నపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేద‌ని ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు మండిప‌డుతున్నారు. అధికారంలో ఉన్న‌ప్ప‌డు ప ద‌వులు అనుభ‌వించి, ఇప్పుడు క‌ష్ట‌కాలంలో అండ‌గా ఉండాల్సింది పోయి, పార్టీపై అభాండాలు వేయ‌డం ఏంట‌ని క్యాడ‌ర్‌లో ఆగ్రహావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి.

నేను టెక్నిక‌ల్ గా కాంగ్రెస్‌పార్టీలోనే ఉన్నా.. బీజేపీలోకి వెళ్లాల‌నుకుంటే పార్టీకి రాజీనామా చేసే వెళ్తా..
రాష్ట్రంలో ప‌న్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌లో చేరిన త‌ర్వాత‌.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో పార్టీ ప‌రిస్థితిపై చ‌ర్చ జ‌రుగుతోంది.. అంటూ ఆయ‌న చేసిన కామెంట్లు వివాదాస్ప‌దం అ వుతున్నాయి. అంతేగాక రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ మునిగిపోతున్న టైటానిక్ లాంటిద‌ని, రాబోయే రోజుల్లో టీఆర్ ఎస్‌కు బీజేపీయే ప్ర‌త్యామ్నాయం అని వ్యాఖ్యానించ‌డంపై క్యాడ‌ర్ ర‌గిలిపోతోంది.

కాంగ్రెస్ మ‌హాస‌ముద్రం లాంటిద‌ని కోమ‌టిరెడ్డి లాంటి చోటా నాయ‌కుడు ఒక్క‌డు పార్టీ వీడితే వ‌చ్చే న‌ష్టం ఏమీలేద‌నే అభిప్రాయం సీనియ‌ర్ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. బీజేపీలోకి వెళ్లాల‌కుంటే బాజాప్తా వెళ్లొచ్చ‌ని, అంతేగాని పార్టీపై నింద‌లు వేస్తే ఇక ఉపేక్షించ‌మ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోప‌క్క కాంగ్రెస్‌తోనే కోమ‌టిరెడ్డి కి గుర్తింపు వ‌చ్చింద‌ని, ఆయ‌న పార్టీ వీడితే వ‌చ్చే న‌ష్ట‌మేమి ఉండ‌ద‌ని కాంగ్రెస్ శ్రేణులు సైతం పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం.

రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ను వీడి, బీజేపీలోకి వెళ్లినా.. ఆయ‌న వెంట వెళ్లేందుకు ద్వితీయ శ్రేణి నా య‌కుల‌తోపాటు క్యాడ‌ర్ సిద్ధంగా లేద‌నే విష‌యాన్ని కోమ‌టిరెడ్డి గ్ర‌హించాల‌ని అంటున్నారు. కోమ‌టిరెడ్డి వాపును చూసి బ‌లుపు అనుకుంటున్నార‌ని, త‌న‌కు తాను పెద్ద నాయ‌కుడినే భ్ర‌మ‌లో అనుచిత వ్యా ఖ్య‌లు చేస్తే ఇక స‌హించేదిలేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాంగ్రెస్ ను వీడిన త‌ర్వాత గానీ ఆయ‌న బ‌ల‌మేంటో తెలుస్తుంద‌ని వారు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts