ప‌ద‌వి లేక‌పోతే ఫారిన్ పోతానంటోన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

September 10, 2019 at 11:07 am

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అసంతృప్త నేతలు బహిరంగంగానే తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇవి గంట గంట‌కు పెరుగుతూనే ఉన్నాయి. మంత్రివ‌ర్గ మార్పుల‌కు ముందు నుంచే క్ర‌మ‌క్ర‌మంగా అస‌మ్మ‌తి రాగాలు బ‌య‌ట‌పడ్డాయ్‌. ముందుగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆ వెంట‌నే మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగిన వెంట‌నే మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని మాట ఇచ్చి తప్పార‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. ఇక మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాటికొండ రాజ‌య్య సైతం 12 శాతం ఉన్న మాదిగ‌ల‌కు ఒక్క మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక మ‌రో మాజీ మంత్రి జోగు రామ‌న్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే వంతు వ‌చ్చింది.

తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో తనకు పని లేనందునే పరీక్షలు రాస్తున్నానని.. ఏదైనా పదవి ఇస్తే పని చేస్తానని వ్యాఖ్యానించారు. ఇక్క‌డ ప‌నిలేక‌పోతే విదేశాల‌కు పోతాన‌ని చెప్పారు. ఇక ఆర్మూర్ వినాయక మండపంలో జీవన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆర్మూర్ ప్రజలు తనను దైవంలా ఆరాధిస్తారని.. అందులో తప్పేముందన్నారు.

ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ని చేస్తున్న వారి విగ్ర‌హాలు ఎందుకు ? పెట్ట‌డం లేదు. తనను ఆరాధిస్తూ విగ్రహాలు పెట్టిన వాళ్లను ఎలా నియంత్రించగలను అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏదేమైనా ప‌క్క‌నే ఉన్న ప్ర‌శాంత్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చి త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో జీవ‌న్‌రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా.

ప‌ద‌వి లేక‌పోతే ఫారిన్ పోతానంటోన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts