మ‌ళ్లీ షాక్ ఇచ్చిన ఈటల‌

September 14, 2019 at 3:28 pm

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ వైఖరి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా అధిష్టానాన్ని టార్గెట్‌గా చేసుకుని ఆయ‌న చేస్తోన్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈట‌ల కాస్త ఓపెన్ అయ్యాకే ఆ ధైర్యంతోనే చాలా మంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వ‌రాలు వినిపించారు. తాజాగా బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ అహ్మ‌ద్ అసంతృప్త వ్యాఖ్య‌లు చ‌ల్లారాయ‌నుకుంటున్న టైంలోనే ఇప్పుడు మ‌ళ్లీ ఈట‌ల మ‌రోసారి త‌న అసంతృప్తిని బ‌య‌ట పెట్టుకున్నారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తిరిగి శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గాయకుడు దేశపతి శ్రీనివాస్‌కు ఈటల రాజేందర్‌కు మధ్య ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సభ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల‌, తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాద‌రి కిషోర్‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళుతున్నారు. అక్క‌డే ఉన్న దేశ‌ప‌తి సార్ నేను మీతో రావొచ్చా ? అని పలకరించే ప్రయత్నం చేశారు.

ఈ వ్యాఖ్య‌కు ఈట‌ల నుంచి షాకింగ్ ఆన్స‌ర్ వ‌చ్చింది. ఇప్పుడు నా అవసరం మీకేముందయ్యా అంటూ ఊహించని రీతిలో సమాధానమిచ్చారు. షాక్ తిన్న దేశ‌ప‌తి అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ప‌క్క‌న ఉన్న వారు సైతం కాస్త షాక్ అయ్యారు. దీంతో ఈట‌ల‌ వ్యాఖ్యలు మరోసారి టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక కొద్ది రోజులుగా పార్టీలో అస‌మ్మ‌తి స్వ‌రాల‌పై కొంద‌రు ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. కొంద‌రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయం ఉగ్రరూపం దాల్చి.. ఎవరో ఫోన్ చేస్తే సాయంత్రానికి చల్లబడడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు.

ఇక మిర్యాల‌గూడ ఎమ్మెల్యే భాస్క‌ర‌రావు మాట్లాడుతూ అందరికి పదవులు కావాలంటే సాధ్యం కాదు. పదవులు కోరి రాకుంటే బాధ ఉండటం సహజం. మనలో ఎవరికి వచ్చినా ఒకరికి ఒకరు సహకరించుకోవాలి.. అరికపూడి గాంధీ మంత్రి పదవి కావాలి అనుకున్నాడు రాలేద‌ని.. తాను, తుమ్మ‌ల ఇంటికి పిలిపించి క్లాస్ పీక‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యార‌ని చెప్పారు.

మ‌ళ్లీ షాక్ ఇచ్చిన ఈటల‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts